'మిస్టర్' అంటూ క్లాసిక్ ఫీచర్స్‌తో 'కంచె' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్. తొలి సినిమా అయినా జమీందారీ యువతి పాత్రకు ప్రాణం పెట్టేసింది. అందంగా హుందాగా ఆకర్షించింది. ఆ తర్వాత కొంచెం కొంచెంగా తనలోని గ్లామర్ యాంగిల్స్‌ని చూపించేందుకు కంచెలు తెంచేసింది. 'జయ జానకీ నాయకా' చిత్రంలో సూపర్ హాట్‌గా ఐటెం సాంగ్‌లో మెరిసింది. 'నక్షత్రం'లోనూ తేజుతో హాట్ రొమాన్స్ పండించేసింది. గ్లామర్ కంచెలు తెంచినాక అమ్మడికి అవకాశాలు అంతంత మాత్రమే అయిపోయాయి. సక్సెస్ కూడా ఆమడ దూరం పారిపోయింది. హీరోయిన్‌గా చెప్పుకోదగ్గ పాత్రలు పడలేదు. ఆ స్థాయిలో ఆఫర్లు దక్కించుకోలేకపోయింది. ఇక తాజా పిక్ విషయానికి వస్తే, స్కిన్ కలర్ డ్రస్సులో అద్దంలో తన అందాన్ని తానే చూసుకుని సిగ్గుతో వయ్యారాలు పోతోందీ ముద్దుగుమ్మ. చూస్తున్న మనకు 'సీతమ్మా నీ సిగ్గు సింగారం కానూ' అనాలనిపిస్తోంది కదూ.!