'కంచె' సినిమాతో ట్రెడిషనల్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైశ్వాల్ తర్వాత తర్వాత మెల్లగా గ్లామర్ కంచెలు తెంచేసింది. సినిమా సినిమాకీ తనలోని గ్లామర్ యాంగిల్స్‌ని ఒక్కొక్కటిగా బయటికి తీసింది. 'జయ జానకీ నాయకా', 'నక్షత్రం' సినిమాల్లో అమ్మడి గ్లామర్‌కి కుర్రకారు అవాక్కయిపోయారు. ఆ రేంజ్‌లో హాట్‌నెస్ ప్రదర్శించిందీ బ్యూటీ.
తాజాగా 'ఆచారి అమెరికా యాత్ర' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రగ్యాకి ఎక్స్‌పెక్ట్‌డ్ రిజల్ట్ రాలేదీ సినిమాతో. ట్రెడిషనల్ లుక్‌లోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రగ్యాకి గ్లామర్ కంచెలు దాటాక, హిట్ మాత్రం దూరమైపోయింది. అయినా కానీ ఇంకా తాను సాధించాల్సింది చాలా ఉందంటోందీ ముద్దుగుమ్మ. ఒక్క బ్రేక్ వస్తే చాలు, తానేంటో ప్రూవ్ చేసుకుంటానంటోంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ పిక్స్‌తో ఇదిగో ఇలా రెచ్చిపోయి పోజులిచ్చేస్తోంది. ఇదంతా ఇంకెందుకంటారా? అవకాశాల కోసమే మరి.
చూశారుగా ఈ నేవీ బ్లూ కలర్ షార్ట్ ఫ్రాక్‌లో అమ్మడి అందాలు కెవ్వుకేక పుట్టించట్లా.!