'హాటు' ఓకే.. హిట్టు సంగతేంటి.?

By iQlikMovies - November 22, 2018 - 14:32 PM IST

మరిన్ని వార్తలు

హాట్‌ లుక్స్‌తో సోషల్‌ మీడియాలో కిర్రాకు పుట్టించడంలో తనకు సాటి ఇంకెవరూ లేరన్నట్టు హాట్‌ హాట్‌ ఫొటోలతో హల్‌చల్‌ చేస్తుంటుంది 'కంచె' బ్యూటీ ప్రగ్యా జైస్వాల్‌. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా హీరోయిన్‌గా సరైన సక్సెస్‌ మాత్రం ఇంకా ఈ బ్యూటీకి దక్కలేదు. పట్టు వదలకుండా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే వున్న ఈ అందాల భామ ఈ క్రమంలో 'గ్లామర్‌ కంచె'ని ఏనాడో తెంచేసింది. కంచె దాటిన అందాల విందుతో ఇంకెన్నాళ్ళు ఇలా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తూ టైమ్‌ పాస్‌ చేస్తుందోగానీ, ఒక్కటంటే ఒక్కటే హిట్టు.. అది దొరికితే చాలు, హీరోయిన్‌గా తన రేంజ్‌ పెరిగిపోతుందని అనుకుంటోందట ప్రగ్యా జైస్వాల్‌. అంతే మరి, రైట్‌ టైమ్‌ రావాలి.. ఆ టైమ్‌ వస్తే, ఓ మోస్తరు సినిమా చాలు ప్రగ్యా జైస్వాల్‌ని ఓ రేంజ్‌ హీరోయిన్‌గా మార్చేయడానికి. అప్పటిదాకా, ఇదిగో ఇలాంటి హాట్‌ ఫొటోలతో ఆమె సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడం, వైరల్‌ అవుతున్న తన హాట్‌ ఫొటోలతో ఆమె సంతోషపడటం తప్ప, చేయడానికేమీ లేదంతే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS