'ఆర్‌.ఆర్‌.ఆర్‌.' ఓ సాంకేతిక అద్భుతమట

By iQlikMovies - November 22, 2018 - 14:26 PM IST

మరిన్ని వార్తలు

రాజమౌళి సినిమా అంటేనే అందులో సాంకేతికతకి పెద్ద పీట వేస్తాడు. ఏ కథ ఎంచుకున్నాసరే, సాంకేతిక అంశాల విషయంలో అస్సలేమాత్రం రాజీ పడడు ఈ దర్శక ధీరుడు. ఒక్కో సినిమాకీ ఒక్కో తరహా సరికొత్త సాంకేతిక అంశాన్ని పరిచయం చేసే రాజమౌళి, 'ఆర్‌.ఆర్‌.ఆర్‌.' కోసం కూడా అంతకు మించిన అద్భుతాలే చేయబోతున్నాడట. 

ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం ఏకంగా 120 కెమెరాలను ఉపయోగించబోతున్నాడట రాజమౌళి అన్న వార్త ఇప్పుడు సినీ పరిశ్రమలో పెను సంచలనం. 4 డీ సాంకేతిక పరిజ్ఞానంతో సినిమాలో సీన్స్‌ కొన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. చరణ్‌, జూ.ఎన్టీఆర్‌లతో 'మెగా మల్టీస్టారర్‌'గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న రాజమౌళి, అభిమానుల అంచనాలు ఏమాత్రం తగ్గకూడదన్న కోణంలో, సినిమాకి అవసరమైనన్ని 'హంగులు' జోడిస్తున్నాడు. సౌండ్‌ క్లారిటీ, పిక్చర్‌ క్లారిటీ విషయంలో ఇప్పటిదాకా వచ్చిన ఏ తెలుగు సినిమా లేనంత అద్భుతంగా 'ఆర్‌.ఆర్‌.ఆర్‌.' వుండబోతోందట. 

ఇప్పటిదాకా ఇండియాలో అత్యాధునిక టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకున్న సినిమాగా '2.0' రికార్డులకెక్కుతోంటే, అంతకు మించిన సాంకేతికత 'ఆర్‌.ఆర్‌.ఆర్‌.' కోసం రాజమౌళి వాడుతుండడం గొప్ప విషయమే కదా. ఇదిలా వుంటే, ఈ సినిమా కోసం హీరోయిన్ల వేట కొనసాగుతోంది. 

ప్రస్తుతానికైతే చరణ్‌ - ఎన్టీఆర్‌ మధ్య వచ్చే కీలక సన్నివేశాల్ని షూట్‌ చేసేస్తున్నారు. రాజమౌళి గత చిత్రాలకు భిన్నంగా ఈ 'ఆర్‌.ఆర్‌.ఆర్‌.' శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకోనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS