'కంచె' సినిమాతో తెలుగుల తెరకు ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైశ్వాల్. తొలి సినిమాలో అమ్మడు జమీందారీ కూతురుగా చాలా అందంగా కనిపించింది. రాజ వంశస్థురాలి పాత్రలో రాజసం బాగా చూపించింది. కానీ గ్లామరస్‌గా కనిపించే అవకాశం రాలేదు ఈ ముద్దుగుమ్మకి. అయితే అమ్మడికి గ్లామరస్‌గా కనిపించడం అంటేనే ఎక్కువ ఇష్టమట. కానీ ఇంతవరకూ ఆమెకు వచ్చిన పాత్రలన్నీ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకునేవే కానీ, గ్లామరస్‌గా కనిపించేవి కావు. తాజా సినిమా 'ఓం నమో వేంకటేశాయ'లో కూడా అమ్మడు భక్తురాలిగా అందంగానే కనిపించింది. గ్లామర్ చూపించే అవకాశం రాలేదు. కానీ 'గుంటూరోడు' సినిమాతో తన కోరిక తీరిందంటోంది ప్రగ్యా జైశ్వాల్. ఈ సినిమాలో ప్రగ్యా చాలా హాట్ హాట్‌గా కనిపిస్తోంది. చాలా జోష్‌గా కూడా కనిపిస్తోంది. తనకి నచ్చిన పాత్రలో నటిస్తోంది ఈ సినిమాలో ప్రగ్యా. అందుకే 'గుంటూరోడు' సినిమా తనకెంతో స్పెషల్ అంటోంది. అంతేకాదు గ్లామరస్ పాత్రలతోనే హీరోయిన్లు ప్రేక్షకులకు దగ్గరవుతారనీ, గుర్తింపు ఎక్కువగా లభిస్తుందనీ అంటోంది . అలాగే ఇండస్ట్రీలో అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయనీ అంటోంది ముద్దుగుమ్మ ప్రగ్యా జైశ్వాల్. ఇంతవరకూ నటిగా గుర్తింపు తెచ్చుకున్నాను. ఇకపై గ్లామరస్‌గా కనిపించడానికే ఎక్కువగా ప్రయత్నిస్తానంటోంది. అలాగే డిగ్నిఫైడ్ క్యారెక్టర్లు కూడా వదులుకోనంటోంది ముద్దుగుమ్మ ప్రగ్యా.