'కంచె' సినిమాలో సీత పాత్రలో చాలా క్యూట్‌గా అందంగా ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ ప్రగ్యా జైశ్వాల్. క్లాసీ లుక్‌తో తొలి సినిమాకే తన అందంతో కట్టిపడేసిందీ అందాల భామ. ఎక్స్‌ప్రెసివ్ ఫేస్‌తో ఆ పాత్రకు ఎంతో హుందాతనం తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత ప్రగ్యా కెరీర్లో చెప్పుకోదగ్గ పాత్ర దక్కలేదు. ఆ స్థాయిలో ప్రశంశలు అందుకోలేదు. పాత్రల ఎంపికలోనూ, కథల ఎంపికలోనూ ప్రగ్యా సరైన దృష్టి పెట్టలేకపోతోందనే విమర్శలు ఎదుర్కొంటోంది.
అందం, అభినయించే సత్తా ఉన్నప్పటికీ అమ్మడికి సరైన పేరు రాకపోవడానికి కారణం అదే అంటున్నారు ఆమెని అమితంగా అభిమానించే కొందరు వ్యక్తులు. యాక్టింగ్ టాలెంట్‌తో పాటు, గ్లామర్‌తోనూ మెరిసిపోగల సత్తా ఉంది ఈ ముద్దుగుమ్మలో. ఆల్రెడీ హాట్గ్లామర్లో ఈ బ్యూటీ సత్తా చాటేసింది కూడా. 'నక్షత్రం', 'జయ జానకి నాయకా' వంటి చిత్రాల్లో ప్రగ్యా తన గ్లామర్‌తో ఫుల్‌గా హీటెక్కించేసింది.
తాజాగా 'ఆచారి అమెరికా యాత్ర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ తాజా ఫోటోల విషయానికి వస్తే, స్టైల్‌కి స్టైల్, గ్లామర్‌కి గ్లామర్ ఫోటో సెషన్ సింప్లీ సూపర్బ్‌గా ఉంది కదా. ఏమాటాకామాటే చెప్పాలి, అదే ప్రగ్యా గ్లామర్‌కున్న ఎట్రాక్షన్ మరి.