మెగా ప్రాజెక్ట్‌తో రాబోతున్న సూపర్‌స్టార్‌ కూతురు

By iQlikMovies - April 30, 2018 - 17:52 PM IST

మరిన్ని వార్తలు

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తనయ ఐశ్వర్యా ధనుష్‌ 'త్రీ' సినిమాతో మెగా ఫోన్‌ పట్టింది. ఆమె మెగాఫోన్‌ పట్టిన ఈ సినిమాలో భర్త ధనుష్‌ హీరోగా నటించాడు. శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతోనే అనిరుధ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. 'వై దిస్‌ కొలవెరి..' అంటూ ఈ యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ చేసిన సందడి అంతా ఇంతా కాదు. సినిమా ఆశించిన విజయం అందుకోకపోయినా, ఈ సాంగ్‌ మాత్రం తమిళంలోనే కాదు, భాషతో సంబంధం లేకుండా, తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఓ ఊపు ఊపేసింది.

ఈ సంగతిటుంచితే, ఐశ్వర్యా ధనుష్‌ తాజాగా ఓ ప్రాజెక్ట్‌ని టేకప్‌ చేయనుందట. ఈ సినిమాలో సీనియర్‌ హీరో రాజశేఖర్‌ నటించనున్నాడనీ తెలుస్తోంది. ఇదో డిఫరెంట్‌ అండ్‌ ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ అని తెలుస్తోంది. ఇటీవలే రాజశేఖర్‌ హీరోగా 'గరుడవేగ' చిత్రంతో మంచి విజయం అందుకుని, హీరోగా చాలా కాలం తర్వాత తన సత్తా చాటాడు. ఆ సినిమా విజయంతో రాజశేఖర్‌కి పలు సినిమాల్లో అవకాశాలు వస్తున్న మాట వాస్తవమే. కానీ ఆయనే ఆచి తూచి వ్యవహరిస్తున్నారు . ఈ తాజా ప్రాజెక్ట్‌లో రాజశేఖర్‌ హీరోగా నటిస్తారా? లేక ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తారా? అనేది పూర్తిగా తెలియాల్సి ఉంది.

ఈ సినిమాని తమిళంతో పాటు, తెలుగులో కూడా రూపొందించే యోచనలో ఐశ్వర్యా  ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాలో చాలా చాలా స్పెషాలిటీస్‌ ఉన్నాయట. తెలుగు, తమిళ భాషల నుండి పాపులర్‌ నటీ నటులు ఈ సినిమాలో నటించే అవకాశాలున్నట్లు సమాచారమ్‌. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS