'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)కి పోటీగా `ఆత్మ` (ఆల్ తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్) మొదలెడతున్నారంటూ పుకార్లు వచ్చిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. ``ఆత్మ, ప్రేతాత్మ,పరమాత్మలు అంటూ ఏం లేవు. మేం కొత్త అసోసియేషన్ ని ప్రారంభించడం లేదు`` అంటూ స్పష్టం చేశారు. `మా` తరపునే పనిచేస్తాం అని క్లారిటీ ఇచ్చేశారు.
'మా' ఎన్నికల తరవాత కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. `మా` సభ్యత్వానికి ప్రకాష్‌రాజ్, నాగబాబు, శివాజీరాజా రాజీనామా చేశారు. అంతేకాదు.. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన ఈసీ సభ్యులు సైతం రాజీనామా చేశారు. వీళ్లంతా `ఆత్మ` పేరుతో ఓ అసోసియేషన్ ని ప్రారంభిస్తారని చెప్పుకున్నారు. కానీ.. అదేం లేదని ప్రకాష్ రాజ్ చెప్పేయడంతో ఆ వార్తలన్నీ అవాస్తవం అని తేలిపోయింది. ``మా సభ్యుల కోసం మేమంతా పనిచేస్తాం. `మా` సభ్యులకు అన్ని విధాలా సహకరిస్తాం. వాళ్లని ఆదుకుంటాం. అయితే ప్రస్తుతం `మా`లో భయానక వాతావరణం నెలకొంది. అందుకే మా సభ్యులంతా రాజీనామా చేశారు. కానీ ఏమైనా తప్పులు జరిగితే మాత్రం ప్రశ్నించడానికి సిద్ధంగానే ఉంటాం`` అని ప్రకాష్ రాజ్ చెప్పారు.