'మా' లో ముసలం మొదలైయింది. ప్రకాష్ రాజ్ 'సినిమా బిడ్డలం’ ప్యానెల్ నుంచి గెలిచిన వాళ్లందరం మూకుమ్మడి రాజీనామా చేశారు. మంచు విష్ణు ఇచ్చిన హామీలకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకాష్ రాజ్ ప్రకటించారు. రెండు రోజుల నుంచి జరుగుతున్న ఘటనలపై తన ప్యానెల్ సభ్యులతో చర్చించినట్లు , పోస్టల్ బ్యాలెట్‌లో అన్యాయం జరిగిందని, రాత్రికి రాత్రే ఫలితాలు మారాయని, తమ ప్యానెల్‌లోని సభ్యులంతా బయటకు వచ్చి, ‘మా’ సభ్యుల తరపున నిలబడతామని వెల్లడించారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ.. మా ప్యానెల్‌లో ఉన్న వారంతా తప్పు జరిగితే ప్రశ్నించే ధైర్యవంతులు. మేం వెళ్లి ప్రశ్నిస్తే మళ్లీ గొడవలు అవుతాయి. పదవులు లేకపోయినా అందరికీ మేం అండగా ఉంటాం. విష్ణు నాకు సోదరుడులాంటి వారు. నరేశ్‌గారు చాలా అద్భుతంగా ఎన్నికలను నడిపించారు. తన అనుభవంతో కృష్ణుడిలా చక్రం తిప్పి విష్ణుకు విజయం చేకూర్చారు. ఆయన విష్ణు వెనుక ఉన్నప్పుడు మేము ఏదైనా అంటే మళ్లీ సమస్యలు మొదలవుతాయి. అందుకే ఈ రెండేళ్ళు 'మా'ని వారికే వదిలేస్తున్నాం. బయటనుంచి మేము పని చేస్తాం'' అని చెప్పుకొచ్చారు.