కృష్ణవంశీ - ప్రకాష్ రాజ్‌ల మధ్య అనుబంధం ఇప్పటిది కాదు. కృష్ణవంశీ తన ప్రతీ సినిమాలోనూ ప్రకాష్ రాజ్ కు మంచి పాత్రే ఇచ్చాడు. అంతఃపురం తో ప్రకాజ్ రాజ్ గ్రాఫే మార్చేశాడు. ఖడ్గంలో తాను కూడా హీరోనే. అయితే... మధ్యలో ఇద్దరికీ కాస్త గ్యాప్ వచ్చింది. ఆ తరవాత `గోవిందుడు అందరి వాడేలే`తో కలిసిపోయారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ తోనే `రంగమార్తండ` తీశాడు. ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది.
నిజానికి రంగమార్తండ తన దర్శకత్వంలోనే తీయాలని ప్రకాష్ రాజ్ భావించాడు. కానీ మధ్యలో ఏమైందో.. దర్శకత్వ బాధ్యతని కృష్ణవంశీకి అప్పగించేశాడు. తొలుత ఈ చిత్రానికి ప్రకాష్ రాజే నిర్మాత. కొంత డబ్బు కూడా పెట్టాడు. రెండు షెడ్యూల్స్ అయ్యాక..`నా డబ్బులు నాకిచ్చేయండి..` అని పేచీ పెట్టాడట. దాంతో.. మరో నిర్మాతని రంగంలోకి తీసుకొచ్చి, ప్రకాష్ రాజ్ కి డబ్బులు సెటి చేయాల్సివచ్చింది.
ప్రకాష్ రాజ్ పెట్టిన లిటికేషన్ వల్ల.. ఈ సినిమా ఆగిపోయి, ఆర్థిక ఇబ్బందుల్లో పడాల్సివచ్చిందని టాక్. లేదంటే ఎప్పుడో పూర్తయిపోయేది. మరి.. సినిమా మొదలెట్టిన ప్రకాష్ రాజ్ మధ్యలోనే విత్ డ్రా చేసుకోవడం ఏమిటో??