తెలంగాణ ముఖ్యమంత్రిని ఈరోజు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఈరోజు హైదరాబాద్ లో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. KCR ఫెడరల్ ఫ్రంట్ ప్రకటన తరువాత వీరిరువురి భేటి ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.
ఈ భేటీ పైన వివిధరకాల అభిప్రాయాలు వెల్లడవుతుండగా అందులో ముఖ్యంగా ప్రకాష్ రాజ్ BJP పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుండడం అలాగే #JustAsking అంటూ సోషల్ మీడియాలో ఒక ఉద్యమంలా చేస్తున్నాడు. ఇక KCR విషయానికి వస్తే, అటు కాంగ్రెస్ తోనూ ఇటు BJP తోనూ సమదూరంగా ఉంటూ ఒక కొత్త ఫ్రంట్ కి రూపం ఇచ్చే పనిలో ఉన్నాడు.
మరి ఈ ఇద్దరు భవిష్యత్తులో కలిసి పనిచేయబోతున్నారా? ఇప్పటికే 2019లో సాధారణ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పోటీ చేస్తాను అని ప్రకటించగా, ఇప్పుడు ఆయన ఈ కొత్త ఫ్రంట్ తరపున పోటీ చేస్తాడా అన్నది ఆసక్తిగా మారింది.
చూద్దాం.. ఏదైనా ఇంకోద్దిరోజుల్లో దీని పైన ఒక క్లారిటీ వస్తుంది.