బాపు బొమ్మకి ‘సోషల్‌’ బాధ్యత ఎక్కువే!

మరిన్ని వార్తలు

‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో ‘బాపుబొమ్మ’గా పొగిడిరచుకున్న ముద్దుగుమ్మ ప్రణీత. హీరోయిన్‌గా అంతకు ముందూ, ఆ తర్వాత చాలా చిత్రాల్లో నటించింది. అయితే, ‘అత్తారింటికి దారేది’ సినిమా ప్రణీతకు వన్‌ ఆఫ్‌ ది స్పెషల్‌ మూవీగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రణీత చేస్తున్న సినిమా ప్రాజెక్టుల సంగతి పక్కన పెడితే, ఓ సెలబ్రిటీగా తన బాధ్యతను తాను అంతకు మించి అనే స్థాయిలో నెరవేరుస్తోంది. కరోనా నేపథ్యంలో దేశ ఆర్ధిక పరిస్థితి సన్నగిల్లిపోయింది. ప్రతీ ఒక్కరికీ కరోనాతో పెద్ద తంటానే వచ్చి పడింది. పెద్ద వాళ్లకు పెద్ద కష్టం, చిన్న వాళ్లకు చిన్న కష్టం.. మొత్తానికి దేశానికే పెద్ద నష్టాన్ని మిగుల్చుతోంది ఈ మాయదారి కరోనా మహమ్మారి.

 

ఈ తరుణంలో డైలీ కూలీల కష్టాలు వర్ణనాతీతం. అలాంటి వారికి సాయమందించడానికి ప్రణీత ముందుకొచ్చింది. ఇప్పటికే ప్రణీత ఫౌండేషన్‌ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేసింది ప్రణీత. తాజాగా ఇతర సంస్థలతో కలిసి మరో అడుగు ముందుకేసింది. డైలీ లేబర్‌ని ఆడుకునే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సినీ పరిశ్రమలో ఎంతో మంది స్టార్‌ హీరోయిన్స్‌ ఉన్నా, వారందరిలోనూ ప్రణీత వేరయా అన్నట్లు, కరోనా బాధితుల్ని ఆదుకోవడంలో ఆమె చూపిస్తున్న ఈ సోషల్‌ రెస్పాన్సిబులిటీని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారంతా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS