'ఏం పిల్లో ఏం పిల్లడో' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రణీతకి, తెలుగు సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చిన సినిమా ఏదంటే, అది 'అత్తారింటికి దారేది' మాత్రమేనని చెప్పవచ్చు. ఆ తర్వాత పెద్ద సినిమాల్లో అవకాశాలొచ్చినా, అవి సక్సెస్ కాకపోవడంతో ప్రణీత తెలుగు తెరకు దూరమైంది. కన్నడలో మాత్రం కొన్ని సినిమాలు చేస్తోందిప్పుడు. తమిళంలోనూ అడపా దడపా కనిపిస్తోంది. తల్లిదండ్రులు వైద్య వృత్తిలో కొనసాగుతుండగా, ప్రణీతకి మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనే కోరిక ఉంది. అందుకే రెస్టారెండ్ బిజినెస్‌లోకి దిగింది. అయితే గ్లామరస్ ఇండస్ట్రీకి దూరమయ్యే ఛాన్సే లేదంటూ, అప్పుడప్పుడూ ఇలా తళుక్కుమంటోంది. డిజైనర్ వేర్లో ఈ బ్యూటీ కెవ్వు కేక అంతే.
ALSO SEE :
Qlik Here For The Gallery