గ్లామ్‌షాట్‌: గ్లామర్‌ పోజులో బాపు బొమ్మ!

మరిన్ని వార్తలు

అమ్మో బాపుగారి బొమ్మో అంటూ ఏకంగా పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ చేత పొగిడించుకున్నా, ముద్దుగుమ్మ ప్రణీతకు దక్కాల్సిన స్టార్‌డమ్‌ దక్కలేదు. పవర్‌ స్టార్‌తో పాటు, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ వంటి స్టార్‌ హీరోల సరసన కూడా అందాల రాకాసిగా తళుక్కున మెరిసింది. కానీ ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే అయ్యాయి. ఇకపోతే గ్లామర్‌ పరంగానూ ప్రణీత టాప్‌ లెవల్‌ అని చెప్పక తప్పదు. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించింది.

 

ఇటీవల 'హలో గురూ ప్రేమ కోసమే' చిత్రంలో రామ్‌ సరసన కనిపించింది. ఈ సినిమా కూడా ఆశించిన విజయాన్ని దక్కించుకోలేదు. అలాగే బాలకృష్ణ సరసన 'ఎన్టీఆర్‌ కథానాయకుడు'లో కృష్ణ కుమారి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. బొంగరాల్లాంటి కళ్లతో ఉంగరాల జుట్టేసుకుని మెస్మరైజ్‌ చేయగల అందం ఉంది కానీ, ప్రణీతకి టైం కలిసి రావడం లేదు. కలిసొచ్చిందా దున్నేస్తుందంతే. ఇక సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రణీత తాజాగా ఓ ఫోటో పోస్ట్‌ పెట్టింది. ఎల్లో కలర్‌ మోడ్రన్‌ వేర్‌లో గ్లామర్‌ అప్పీల్‌ ఇస్తున్న ప్రణీత పోజు కళ్లు చెదరగొట్టేస్తోందిలే.

ALSO READ : Pranitha Gallery


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS