కేజీఎఫ్‌తో సంచలనం సృష్టించాడు ప్రశాంత్ నీల్. అసలు ఆ సినిమాకి తెరకెక్కించిన విధానం, టేకింగ్, హీరో ఎలివేషన్స్.. మాస్‌కి పిచ్చెక్కించేశాయి. ప్రశాంత్ తో పనిచేయాలని చాలామంది హీరోలు ముందుకొచ్చారు. తనతో సినిమా చేయాలని చాలా నిర్మాణ సంస్థలు ఎగబడ్డాయి. అయితే కేజీఎఫ్ 2 అయ్యేంత వరకూ వేరే కమిట్మెంట్స్ ఏమీ పెట్టుకోలేదు ప్రశాంత్. కానీ ఇప్పుడు మైత్రీలో బుక్ అయ్యాడు ప్రశాంత్.
మైత్రీ మూవీస్ ప్రశాంత్‌తో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఆల్రెడీ 2 కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చేసింది. కేజీఎఫ్ 2 తరవాత ప్రశాంత్ నీల్ మైత్రీలోనే సినిమా చేయడం ఫిక్సయ్యింది. అయితే హీరో ఎవరన్నది సస్పెన్స్. ప్రశాంత్ నీల్ ఇది వరకు ఎన్టీఆర్, మహేష్ లాంటి స్టార్ హీరోల్ని కలిసి కథ చెప్పాడు. వాళ్లూ ప్రశాంత్ తో సినిమా చేయడానికి ఉత్సాహంగానే ఉన్నారు. వీళ్లలో ఒకరితో మైత్రీ సినిమా ఉండొచ్చు. 2021లో ఆ వివరాలు బయటకు వస్తాయి.