ఇండియన్ స్క్రీన్ పై అసలు సిసలైన... మల్టీస్టారర్ రాబోతోందా? ప్రభాస్, చిరంజీవి కలిసి నటించబోతున్నారా? ఆ అవకాశాలున్నాయంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం `సలార్`. ఇందులో ఓ డాన్ కి రైట్ హ్యాండ్ గా ప్రభాస్ కనిపించబోతున్నాడు. ఆ డాన్ పాత్ర కోసం చాలా మంది పేర్లు పరిశీలించాడు ప్రశాంత్ నీల్. మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి వాళ్లని తీసుకుంటే పర్‌ఫెక్ట్ గా సరిపోతుంది.
అయితే... వాళ్లని ఆ తరహా పాత్రల్లో జనం చూసేశారు. కాబట్టి.. వేరే నటుడు అవసరం అయ్యింది. ఆ పాత్రకు చిరంజీవి అయితే ఎలా ఉంటుందా? అనే సందిగ్థంలో పడ్డాడట ప్రశాంత్ నీల్. ఈ ఆలోచన ప్రభాస్‌కి కూడా బాగా నచ్చిందని టాక్. అందుకే ఈ విషయమై... చిరుని సంప్రదించాలని భావిస్తున్నాడట ప్రశాంత్. చిరు ఓకే అంటే మెగాస్టార్, రెబల్ స్టార్ ని ఒకే తెరపై చూసే అవకాశం దక్కుతుంది. కాకపోతే... ఈ తరహా పాత్రలకు చిరు ఒప్పుకుంటాడా? అనేది చూడాలి. ఒప్పుకుంటే మాత్రం అది చరిత్రే అవుతుంది. చూద్దాం.. ఏమవుతుందో?