విభిన్నమైన కథలను ఎంచుకుని, తనలోని వైవిధ్యాన్ని ఎప్పటికప్పుడు చూపిస్తూనే వస్తున్నాడు సుధీర్ బాబు. ప్రస్తుతం ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే.. శ్రీదేవి సోడా సెంటర్. ఈ రోజు సుధీర్ బాబు బర్త్‌డే. ఈ సందర్భంగా ఈచిత్రం నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. సూరిబాబు పాత్రలో సుధీర్ బాబుని పరిచయం చేశారు. సిక్స్‌ప్యాక్ తో కనిపించిన సుధీర్ బాబు... మాస్ ని మెప్పించే పనిలో పడ్డాడు.
విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. మణిశర్మ ఇచ్చిన నేపథ్య సంగీతం యధావిధిగా అదిరిపోయింది. ఈ చిత్రంలో శ్రీదేవిగా ఆనంది నటిస్తోంది. తన పాత్రని మాత్రం దాచి ఉంచారు. పలాస లా ఇది కూడా 1980 బ్యాక్ డ్రాప్ లో సాగే కథ. అయితే.. కమర్షియల్ అంశాలు మాత్రం మెండుగా ఉంటాయట. సుధీర్ బాబు క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్ కనిపిస్తాయని చిత్రబృందం చెబుతోంది.