ప్రతిరోజూ పండగే' వల్ల 'రూలర్'కి పెద్ద దెబ్బే !

మరిన్ని వార్తలు

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో వస్తోన్న 'రూలర్' డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా పై ఆశించిన స్థాయిలో ఆడియన్స్ నుండి పెద్దగా బజ్ రావడంలేదు. ఇప్పటికే టీజర్ ను పవర్ ఫుల్ గా కట్ చేసి వదిలినప్పటికీ.. అలాంటి యాక్షన్ అండ్ బిల్డప్ షాట్స్ లో బాలయ్యను చూసి చూసి ఆడియన్స్ కి బాగా బోర్ కొట్టేసింది. దీనికి తోడు సమాజంలో అన్యాయం జరగడం.. దాంతో మన నట సింహం రెచ్చిపోయి తెగ నరికి ఆ అన్యాయాన్ని అరికట్టడం ఇలాంటి రొట్ట కొట్టుడు సినిమాలకు ఇక బాలయ్య ఎండింగ్ కార్డు ఎంత త్వరగా ఇస్తే అంత మంచింది. లేకపోతే హిట్ మాట తర్వాత సంగతి, ఇక నుండి బాలయ్య సినిమాలకు మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రావు. ఇప్పుడు రూలర్ పరిస్థితి అలాగే ఉంది.

 

డిసెంబర్ 20న మరో సినిమా “ప్రతిరోజూ పండగే” పోటీలో ఉండటంతో రూలర్ కలెక్షన్స్ భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా... మారుతి దర్శకుడిగా వస్తోన్న “ప్రతిరోజూ పండగే” ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానికితోడు పల్లెటూరి నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఎక్కువమంది ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ఇక ఈ చిత్రంలో ధరమ్ తేజ్ సరసన గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మొత్తానికి 'ప్రతిరోజూ పండగే' రూలర్ కి పెద్ద దెబ్బే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS