ప్రభాస్ పెళ్లి పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

మరిన్ని వార్తలు

తెలుగు ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రభాస్ పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ప్రభాస్ ను మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు ? అని ఎప్పటికప్పుడు మీడియా ప్రశ్నించడం, దానికి ప్రభాస్‌ ‘పెళ్లి జరగాల్సిన సమయంలో అదే జరుగుతుంది అంటూ ఆ ప్రశ్నను పక్కకి తప్పించడం జరిగిపోతూ ఉంది. కాగా ప్ర‌భాస్ పెళ్లి గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త తెలిసింది. ప్ర‌భాస్ పెద‌నాన్న కృష్ణంరాజుగారి సతీమణి శ్యామ‌లా దేవి ప్రభాస్ పెళ్లి పై ఫ్యామిలీ ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రభాస్ చేస్తోన్న జాన్ సినిమా పూర్తీ అయ్యాక ప్రభాస్ పెళ్లి ఉంటుందని ఆమె తెలిపారని తెలుస్తోంది.

 

ఏమైన ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని ప్రభాస్ ఫ్యాన్స్ చాల ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ జిల్‌ ఫేమ్ రాధాకృష్ణ తెర‌కెక్కిస్తున్న జాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా విడుద‌లై పోయిన త‌ర్వాత మొత్తానికి ప్ర‌భాస్ పెళ్లి పీట‌లు ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన సాహో ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుద‌లై పరాజయం పొందటంతో ప్రభాస్ ఫ్యాన్స్ బాగా డీలా పడ్డారు. అందుకే జాన్ పై ప్రత్యేకదృష్టిని పెట్టాడు.

 

అన్నట్లు సురేందర్ రెడ్డి కూడా ప్రభాస్ కోసం ఓ స్క్రిప్టును సిద్ధం చేస్తోన్నాడట. ఓ స్టైలిష్ ఎంటర్‌టైనర్‌ గా ఈ సినిమా ఉండనుందని సమాచారం. ఇక మూడు భాషల్లో తెరకెక్కనున్న జాన్ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 చివ‌ర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS