తాత - మనవడు పండగలా దిగి వచ్చారు.!

మరిన్ని వార్తలు

పల్లెటూరి నేపథ్యంలో ఆహ్లాదమైన కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతోన్న చిత్రం 'ప్రతిరోజూ పండగే'. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ చేస్తున్న ప్రమోషన్‌ కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. ఆ క్రమంలో తాజాగా విడుదల చేసిన లిరికల్‌ సాంగ్‌ ఆకట్టుకుంటోంది. సాహిత్య పితా మహులు సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుండి జాలువారిన సాహిత్యానికి తమన్‌ అద్భుతమైన మ్యూజిక్‌ తోడై ఈ సాంగ్‌ ఆధ్యంతం ఆకట్టుకుంటోంది.

 

'చిన్నతనం చేర రమ్మంటే ప్రాణం నిన్న వైపే దారి తీస్తోందే..' అంటూ సాగే ఈ పాటలోని లిరిక్స్‌ వింటుంటే నిజంగానే చిన్నతనం గుర్తొస్తోంది. తాత - మనవడుగా సత్యరాజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ కాంబినేషన్‌ చూడ ముచ్చటగా అనిపిస్తోంది. కుటుంబ విలువల్ని తెలియ చెప్పే కథగా మారుతి ఈ సినిమాని మలిచారు. కోనసీమలోని పలు అందమైన లొకేషన్స్‌ ఈ సినిమాలో చూపించనున్నారు. ప్రచార చిత్రాల్లో చూపించిన విజువల్సే చాలా ఆహ్లాదంగా అనిపిస్తున్నాయి. ఇక సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ విశేషంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్‌ నమ్మకం వ్యక్తం చేస్తోంది. రాశీఖన్నా ఈ సినిమాలో తేజుకి జోడీగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS