చూడగానే వెంకీకి నచ్చేసిన సినిమా ఏంటో తెలుసా.?

By iQlikMovies - December 13, 2019 - 10:39 AM IST

మరిన్ని వార్తలు

రీమేక్స్‌ స్పెషలిస్టు అని వెంకీకి మంచి పేరుంది. ఆయన చేసిన రీమేక్‌ సినిమాలు దాదాపు సూపర్‌ హిట్సే తెచ్చిపెట్టాయి ఆయనకు. తాజాగా మరో రీమేక్‌ని సిద్ధం చేసుకున్నారు వెంకీ. అదే ధనుష్‌ నటించిన 'అసురన్‌' మూవీ. ఈ సినిమా చూడగానే నచ్చేసిందట. ఎలాగైనా ఈ సినిమాని రీమేక్‌ చేయాలనుకున్నారట. అరగంటలోనే డెసిషన్‌ తీసుకుని, ఈ మూవీ రైట్స్‌ని సొంతం చేసుకున్నామని వెంకీ చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాని పట్టాలెక్కించనున్నారు.

 

వెంకీతో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీకాంత్‌ అడ్డాల ఈ సినిమాకి దర్శకుడు. ఈ మధ్య శ్రీకాంత్‌ అడ్డాలకు అంతగా ఏదీ కలిసి రావడం లేదు. దాంతో అంది వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న కసితో ఉన్నారట. వెంకీ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా ఒరిజినల్‌లో చిన్నా, చితకా మార్పులు చేసే క్రమంలో శ్రీకాంత్‌ అడ్డాల బిజీగా ఉన్నారట. ఈ సినిమాలో వెంకీ సరసన నటించబోయే హీరోయిన్‌ కోసం ప్రస్తుతం వేట కొనసాగుతోంది. ఇదిలా ఉంటే, ఈ రోజు వెంకీ, చైతూ కాంబినేషన్‌లో రూపొందిన 'వెంకీ మామ' చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పాయల్‌ రాజ్‌పుత్‌, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. సినిమా రిజల్ట్‌ ఎలా ఉందో తెలియాలంటే, ఇంకాస్సేపు ఆగాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS