ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి 2024 ఎంత పేరు తెచ్చిందో, అదే స్థాయిలో వివాదాలు తెచ్చింది. ఎలక్షన్ టైమ్ లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికోసం ప్రచారానికి నంద్యాల వెళ్ళటంతో మొదలయ్యాయి బన్నీ లైఫ్ లో వివాదాలు. మెగా ఫ్యామిలీ అంతా కూటమిలో ఉంది. వైసీపీ ఒక్కటే వారికి ప్రత్యర్థి. కానీ బన్నీ కూటమిని కాదని, వైసీపీ కి సపోర్ట్ చేయటం మెగా ఫాన్స్ భరించలేకపోయారు. అప్పటినుంచి మెగా వర్సెస్ అల్లు అన్నట్టు మారిపోయింది. పుష్ప 2 మూవీతో వరల్డ్ వైడ్ గా పాపులారిటీ తెచ్చుకున్న బన్నీ అదే మూవీ కారణంగా అనుకోని వివాదం లో చిక్కుకున్నారు. పుష్ప 2 ప్రీమియర్ షో చూసేందుకు తన ఫ్యామిలీతో కలిసి సంధ్యా ధియేటర్ కి వెళ్లగా అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మరణించటం, ఆమె కొడుకు శ్రీ తేజ్ గాయపడటం తెలిసిందే.
ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు బన్నీ పై కేసు ఫైల్ చేసారు. డిసెంబరు 13 న చిక్కడపల్లి పోలీసులు బన్నీని అరెస్ట్ చేసారు. నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టగా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ కారణంగా నెక్స్ట్ డే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా జనవరి 3 న నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరి చేసింది. దీనితో బన్నీకి బిగ్ రిలీఫ్ దొరికింది. అయితే ఈ సంఘటనల నేపథ్యంలో బన్నీ ఫ్యామిలీ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకోనుందని టాక్.
ఈ మధ్య అల్లు అర్జున్ గూర్చి రాసేటప్పుడు సంధ్య థియేటర్ ఘటనని ప్రస్తావిస్తూ బన్నీని అడ్రస్ చేయటంపై ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం అసంతృప్తిగా ఉన్నారని, అల్లు అర్జున్ ఇంత పేరు ప్రతిష్టలు తెచ్చుకుని వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందిన వ్యక్తి అని, ఇలా అడ్రస్ చేయటం నచ్చలేదని, బన్నీ పేరు ప్రతిష్టలకు ఇది మైనస్ అవుతోంది అని వాపోతున్నారట. 22 ఏళ్ళు ఎంతో కష్టపడి, తెలుగువారికి అందని ద్రాక్షలా ఉన్న నేషనల్ అవార్డు కూడా పొందిన నటుడ్ని ఇలా ప్రస్తావించటం బాధాకరం అని, తన ప్రమేయం లేకుండా జరిగిన పొరపాటుకు కెరియర్ ని ఇంతలా డ్యామేజ్ చేయాలా అని బాధపడుతూ, ఇకపై అల్లు అర్జున్ గురించి ప్రస్తావించినప్పుడు కేవలం అల్లు అర్జున్ అని అంటే చాలని స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్, పాన్ ఇండియా స్టార్ లాంటి ట్యాగ్ లు వద్దని, సంధ్యా థియేటర్ ఘటన లో అరెస్ట్ అయిన అల్లు అర్జున్, బన్నీ లాంటి మాటలు వద్దని ఒక నోట్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట ఫ్యామిలీ మెంబర్స్.