రానా పెళ్లి సెట్ అయిపోయింది. నితిన్ కి పెళ్లి కూతురు దొరికేసింది. నిఖిల్ పెళ్లయిపోయింది. ఇక ప్రభాస్ పెళ్లి విషయంలోనే ఓ స్పష్టత రావాల్సివుంది. టాలీవుడ్ లోనే కాదు, దేశం మొత్తమ్మీదే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ప్రభాస్. ఇది వరకు ఏ హీరో పెళ్లి గురించీ రానన్ని గాసిప్పులు ప్రభాస్‌పై పుట్టాయి. పుడుతూనే ఉన్నాయి. వీటిపై ప్రభాస్ కూడా చాలా సార్లు స్పందించాడు. ఇంట్లో వాళ్లు సైతం పెళ్లికి తొందర చేస్తున్నారన్నాడు. బాహుబలి తరవాత పెళ్లి గురించి ఎప్పుడు ప్రస్తావించినా... `రానా పెళ్లి కానివ్వండి..` అంటూ సమాధానం దాటేసేవాడు.
రానా కూడా అదే మాట. `ముందు ప్రభాస్ పెళ్లి అవ్వాలి` అనేవాడు. ఇప్పుడు రానా పెళ్లి ఖాయమైంది. ఇక పెళ్లి కూతురిని చూసుకోవాల్సింది ప్రభాసే. నిజానికి ప్రభాస్ పెళ్లి కూడా సెట్ అయిపోయిందని, పిల్ల దొరికేసిందని, లాక్ డౌన్ వల్ల పెళ్లికి ముహూర్తం నిర్ణయించలేకపోయారని టాక్. లాక్‌డౌన్ ఎత్తేశాక.. ప్రభాస్ పెళ్లిపై ఓస్పష్టత వస్తుందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంత వరకూ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని ప్రభాస్ కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారన్నమాట. రానాలా ప్రభాస్ కూడా ఏదో ఓ రోజు.. సడన్ గా పెళ్లి బాంబు పేల్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత వరకూ పెళ్లి కబురు కోసం ఎదురు చూడాల్సిందే.