ఇటీవల కాలంలో కుర్రహీరోలు ఈజీగా సిక్స్ ప్యాక్ చేసేస్తున్నారు. హీరోలుగా ఎంట్రీ ఇవ్వడానికి ముందే సిక్స్‌ప్యాక్ బాడీతోనే తెరంగేట్రం చేస్తున్నారు. అయితే జూనియర్ మహేష్‌బాబులా ఉండే ప్రిన్స్ మాత్రం ఇంతవరకూ ఈ సిక్స్ ప్యాక్‌ని ట్రై చేయలేదు. అయితే ఇప్పుడు ట్రై చేయక తప్పలేదు కాబోలు. సిక్స్ ప్యాక్‌తో కండలు తిరిగిన శరీరంతో ఫోటోలు దిగి నెట్లో పోస్ట్ చేశాడు. అసలే అందగాడు కదా.
ఈ సిక్స్ ప్యాక్ బాడీతో ప్రిన్స్‌ని అలా చూస్తుంటే అమ్మాయిలు మనసు పారేసుకోరూ. అదే జరుగుతోందిప్పుడు. ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి సోషల్‌మీడియాలో. మామూలుగానే ప్రిన్స్‌ది జిమ్ బాడీ. ఇక దానికిలా ఆరు పలల ఆకృతి తీసుకొస్తే ఇంకేమైనా ఉందా? బాలీవుడ్ హీరోలని తలపిస్తున్నాడంటూ నెట్టింట్లో అమ్మాయిలు ప్రిన్స్‌కి మెసేజ్‌ల మీద మెసేజ్‌లు పంపిస్తున్నారట. 'నీకు నాకూ డాష్ డాష్' అంటూ తేజ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరో ప్రిన్స్. ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత 'బస్‌స్టాప్' తదితర సినిమాల్లో హీరోగా నటించాడు.
'నేను శైలజ' సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్‌కి అన్నగా నటించాడు. ఇలా హీరోగానే కాకుండా, ఇంపార్టెంట్ రోల్స్‌కీ సై అంటున్నాడు ప్రిన్స్. అయితే తన బాడీ హీరో పాత్రకి ఫుల్ ఫిట్ అని ప్రూవ్ చేసేలా ఇదిగో వర్కవుట్స్ చేసి ఇలా దర్శనమిచ్చాడు. ఈ కష్టమంతా ఓ సినిమా కోసమనీ ప్రచారం జరుగుతోంది. ప్రిన్స్‌తో ఓ కొత్త డైరెక్టర్ సరికొత్త యాక్షన్ మూవీని తెరకెక్కిస్తున్నాడట. ఆ సినిమా కోసమే ప్రిన్స్ ఇలా కండలు పెంచేశాడనీ సమాచారమ్. దానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయిలే!