నటి శ్రీదేవి అంత్యక్రియలు మరో గంటలో మొదలుకాన్నాయి. దీనికి సంబందించే ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేశారు శ్రీదేవి కుటుంబసభ్యులు. ఇక ఆమె పార్థీవదేహాన్ని ఉంచిన క్లబ్ కి సామాన్య జనం, ప్రముఖులు విచ్చేసి శ్రీదేవికి శ్రద్ధాంజలి తెలియచేస్తున్నారు.
దీనికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలీసు శాఖ వారు కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు చెప్పట్టారు. అలాగే ఆమె అంత్యక్రియలని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు అక్కడి ప్రభుత్వంఆదేశించింది.
మధ్యాహ్నం 3.30గంటలకు విలే పార్లే లోని హిందూ శ్మశానవాటికలో జరగబోయే శ్రీదేవి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగబోతున్నాయి. అంతకముందు ఇప్పుడు ఆమె పార్థీవదేహాన్ని ఉంచిన క్లబ్ నుండి ప్రత్యేకంగా అలంకరించిన ఒక వాహనంలో ఆమెని ఊరేగింపుగా శ్మశానవాటిక వరకు తీసుకెళ్ళనున్నారు.