'లీడర్' సినిమా అంటే క్యూట్ బ్యూటీ రీచా గంగోపాధ్యాయ పేరు గుర్తుకొస్తుంది. ఇదే ఆమెకు డెబ్యూ మూవీ. అయితే, ఈ సినిమాలో ఇంకో భామని కూడా గుర్తు చేసుకోవాలండోయ్. అదే ప్రియా ఆనంద్. 'లీడర్'లో ఈ పాప మెయిన్ హీరోయిన్ కాకపోయినా, యాక్టింగ్ పరంగా జోష్ ఉన్న రోల్ అది. రిజిస్టర్డ్ క్యారెక్టరే. కానీ ఎందుకో రిజిస్టర్ చేసుకోలేదు ఆడియన్స్. ఆ తర్వాత 'రామ రామ కృష్ణ కృష్ణ', 'కో అంటే కోటి', '180' తదితర సినిమాల్లో నటించినా ఆశించినంత పాపులారిటీ అమ్మడికి దక్కలేదు.
దాంతో ప్రియా ఆనంద్ కెరీర్ స్లోగానే సాగింది. తమిళ, మలయాళ భాషల్లోనూ ప్రియా ఆనంద్ బాగానే నటించింది. ప్రస్తుతం తమిళ అర్జున్‌రెడ్డి 'ఆదిత్య వర్మ'లో నటిస్తోంది. హీరోయిన్ కాదులెండి, ఓ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. ఏముందిలే బ్రేక్ రావడానికి గెస్ట్ రోలైనా సరిపోతుంది. మరి ఆ బ్రేక్ ప్రియా ఆనంద్ ఏ సినిమాతో వస్తుందో చూడాలి మరి. ఇకపోతే, అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో మెరుపులు మెరిపించే ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్గా ఓ పిక్ పోస్ట్ చేసింది. చుట్టూ గ్రీనరీతో నిండి, పింక్ కలర్ పొట్టి గౌనులో ప్లెజెంట్ ఫీచర్స్‌తో హాయిగా పకృతి ఒడిలో సేద తీరుతున్న ప్రియా ఆనంద్ స్టిల్‌కి 'పిల్ల భలేగుందిరో' అన్న కామెంట్ సూపర్బ్‌గా సరిపోతుందంతే.