శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లీడర్’ ద్వారా ఇద్దరు ముద్దుగుమ్ములు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఒకరు రీచా గంగోపాధ్యాయ కాగా, మరో ముద్దుగుమ్మ ప్రియా ఆనంద్. రిచాకి అదృష్టం కలిసొచ్చింది. కొద్ది కాలంలోనే ప్రబాస్, రవితేజ, నాగార్జున తదితర స్టార్ హీరోల సరసన నటించేసింది. కెరీర్ బాగానే నడిచినా, హయ్యర్ స్టడీస్ నిమిత్తం విదేశాలకు చెక్కేసి, కెరీర్‌కి ఫుల్ స్టాప్ పెట్టేసుకుంది. ఇక రెండో హీరోయిన్ ప్రియా ఆనంద్ విషయానికొస్తే, కెరీర్‌లో నిలదొక్కుకునేందుకు కసరత్తులు చేస్తూనే ఉంది.
ఒక్క స్టార్ హీరో సరసనా ఛాన్స్ దక్కించుకోలేకపోయింది. అరా కొరా సినిమాలు చేస్తూ కెరీర్‌ని అలా అలా నెట్టుకొస్తోంది. అయితే, తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మయాళ తదితర భాషల్లోనూ సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల తమిళంలో ‘ఆదిత్య వర్మ’ సినిమాలో కనిపించింది. తాజాగా కన్నడ సూపర్ స్టార్స్ అయిన రాజ్‌కుమార్ ఫ్యామిలీ హీరోస్‌తో వరుసగా స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. మొన్నా మధ్య పునీత్ రాజ్‌కుమార్‌తో ‘రాజకుమారా’ సినిమాలో నటించిన ప్రియా ఆనంద్, లేటెస్ట్‌గా శివ రాజ్‌కుమార్‌తో ఓ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. చూస్తుంటే కన్నడలో పాప కెరీర్ జోరు మీదున్నట్లే కనిపిస్తోంది. తాజా మూవీ హిట్ అయితే, కన్నడలో స్టార్ హీరోయిన్స్ లిస్టులోకి చేరిపోవచ్చని ప్రియా ఆనంద్ ఆశపడుతోందట. చూడాలి మరి ఈ భామ కోరిక నెరవేరుతుందో లేదో.