ట్రిపుల్‌ ధమాకా: నానికి ‘గోల్డెన్’ ఇయర్‌ కానుందా.?

మరిన్ని వార్తలు

ఈ ఏడాది నాని డైరీలో మూడు సినిమాలున్నాయి. ప్రస్తుతం ‘నిన్ను కోరి’ డైరెక్టర్‌ శివ నిర్వాణతో ‘టక్‌ జగదీష్‌’ చిత్రంలో నటిస్తున్న నాని ఆల్రెడీ ‘వి’ చిత్రాన్ని పూర్తి చేసేశాడు. ఈ చిత్రంలో నాని నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సుధీర్‌ బాబు హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకుడు. త్వరలో రిలీజ్‌ కానుంది. ఇక విలక్షణ చిత్రాలు టార్గెట్ గా ప్రత్యేకంగా నాని రూపొందించిన వాల్‌ పోస్టర్‌ బ్యానర్‌లో రెండో సినిమాగా ‘హిట్‌’ మూవీ రూపొందింది. ఈ నెల 28న ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజ్‌ అయ్యేందుకు ముస్తాబవుతోంది. ఇవే కాక, మరో రెండు సినిమాలు నాని లైన్‌లో పెట్టాడనీ తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాలు త్వరలోనే అనౌన్స్‌ చేయనున్నాడట నాని.

 

ఇక ఈ రోజు బర్త్‌డే జరుపుకుంటున్న నానికి ఈ ఇయర్‌ గోల్డెన్‌ ఇయర్‌ కావాలని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. నిర్మాతగా ‘హిట్‌’ సినిమాతో ఈ ఇయర్‌కి బోణీ కొట్టబోతున్నాడు నాని, టైటిల్‌లోనే ‘హిట్‌’ పెట్టేసి భలే తెలివి తేటలు ప్రదర్శించేశాడు. ఇక తదుపరి ‘వి’ సినిమాతో రానున్న నాని, ద్వితీయార్ధం ‘టక్‌ జగదీష్‌’తో అలరించనున్నాడు. ఎప్పుడు నానిని కదిలించినా, ఏడాదికి మూడు, నాలుగు సినిమాలతో ఫ్యాన్స్‌ని అలరించడమే తన లక్ష్యం అంటూ చెబుతుండే నాని, ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలతో తన కోరిక తీర్చేసుకున్నాడు. మరో రెండు సినిమాల్ని కన్‌ఫామ్‌ చేస్తే చాలు, నాని అనుకున్న టార్గెట్‌ రీచ్‌ అయిపోయినట్లే. నాని కోరిక తీరాలని ఆశిస్తూ, వరుస సక్సెస్‌ల నడుమ మరెన్నో బర్త్‌డేలు జరుపుకోవాలని కోరుకుంటూ మనం కూడా ఆయనకు బర్త్‌డే విషెస్‌ చెప్పేద్దామా. విష్‌ యు వెరీ హ్యాపీ బర్త్‌డే  నాని.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS