బికినీ నాట్‌ ఓకే, బట్‌ లిప్‌లాక్‌ ఓకే అంటోన్న కార్తీ హీరోయిన్‌.!

మరిన్ని వార్తలు

ఒకప్పుడు లిప్‌లాక్‌ సీన్స్‌లో, బికినీ సీన్స్‌లో నటించాలంటే ముద్దుగుమ్మలు కొంత అభ్యంతరం వ్యక్తం చేసేవారు. దాంతో అత్యవసరం అనుకుంటే కెమెరా ట్రిక్స్‌తో ఆ సీన్స్‌ని కానిచ్చేసేవారు. కానీ, ఇప్పుడలా కాదు, వస్తూ వస్తూనే లిప్‌లాక్స్‌, రెచ్చిపోయి ఎక్స్‌పోజింగ్‌ చేసేస్తున్నారు ముద్దుగుమ్మలు. అయితే, ఈ ముద్దుగుమ్మ రూటే సెపరేటండోయ్‌. లిప్‌లాక్స్‌ ఓకే అంటోంది. కానీ బికినీల్లో అస్సలు కనిపించనంటోంది. ఇంతకీ ఎవరీ ముద్దుగుమ్మ? అనుకుంటున్నారా.? ఇటీవల కార్తీ నటించిన 'కడైకుట్టి సింగమ్‌' సినిమా గుర్తుంది కదా.

 

ఆ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించిన ప్రియా భవానీ శంకర్‌. లేటెస్ట్‌గా దర్శకుడు కమ్‌ నటుడు అయిన ఎస్‌.జె. సూర్య 'మాన్‌స్టర్‌' (అదేనండీ ఎలక సినిమా) సినిమాలోనూ హీరోయిన్‌గా మెరిసింది. లేటెస్ట్‌గా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటల్ని పదిలంగా పంచుకుందిలా. ఒకప్పుడు తమిళ టీవీ సీరియల్స్‌లో నటించిన అనుభవమున్న ఈ భామ ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు దక్కించుకుంటోంది.

 

ఆ క్రమంలోనే కార్తి సరసన హీరోయిన్‌గా నటించింది. మరిన్ని మంచి సినిమాల్లో నటించాలని ఆశపడుతోంది. గ్లామర్‌కి హద్దులున్నాయి కానీ, నటనకు హద్దుల్లేవంటోంది. సో అవకాశం రావాలే కానీ, ఏ భాషలోనైనా నటిస్తానని సంకేతాలు పంపుతోంది. అయితే, బికినీ సీన్స్‌లో నటించనని అమ్మడిచ్చిన హింట్‌, అవకాశాలిచ్చేందుకు అన్ని వర్గాల వారినీ ఎట్రాక్ట్‌ చేస్తుందా.? ఏమో వేచి చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS