బ్యాడ్మింటన్‌ 'శిక్ష'ణలో పరిణీతి చోప్రా!

By iQlikMovies - June 19, 2019 - 17:00 PM IST

మరిన్ని వార్తలు

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్రలో ఈ బయోపిక్‌ తెరకెక్కాల్సి ఉంది. అయితే, ఈ ప్రాజెక్ట్‌ నుండి శ్రద్ధా తప్పుకోవడంతో ఆ ప్లేస్‌ పరిణీతి చోప్రాకి దక్కింది. శ్రద్దా కపూర్‌ ఈ పాత్ర కోసం చాలా కష్టపడి సైనా దగ్గరే బ్యాడ్మింటన్‌లో శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, కారణాలు తెలియవు కానీ, శ్రద్ధా తప్పుకోవడంతో, ఆ 'శిక్ష'ణ పరిణీతికి అవసరమైంది. ఈ ఆట చూసినంత వీజీ ఏమీ కాదనీ, ప్రాక్టీస్‌ చేయడమే ఇంత కష్టంగా ఉంటే, కోర్టులో ఆడడం ఇంకెంత కష్టమో.. నువ్వెలా ఆడుతున్నావ్‌ సైనా.. అని పరిణీతి రియల్‌ ఎక్స్‌పీరియన్స్‌తో క్వశ్చన్‌ చేసింది.

 

అంతేకాదు, ఈ శిక్షణలో భాగంగా ఆడి ఆడి అలసిపోయి, అక్కడే కోర్టులో పడుకుండిపోయిన ఫోటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌ అయ్యాయి. సినిమా ఇంకా సెట్స్‌ మీదికెళ్లకుండానే ఇంతలా అలసిపోయావా..? ముద్దుగుమ్మా.? అంటూ కొందరు, అయ్యో.. పరిణీతీ.. నీకెంత పెద్ద కష్టమొచ్చిందీ.. అంటూ ఇంకొందరు ఈ పిక్స్‌కి కామెంట్స్‌ పెడుతున్నారు. సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ అంటే పరిణీతి చోప్రాకి మంచి అవకాశమే.

 

ఒకవేళ ఈ సినిమా సక్సెస్‌ అయితే, పరిణీతి పేరు మార్మోగిపోవడం ఖాయమేనేమో. అమోర్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. మరోవైపు ఈ సినిమా నుండి తప్పుకున్నాక శ్రద్ధాకపూర్‌ పూర్తిగా 'సాహో' సినిమా పైనే దృష్టి పెట్టింది. ఈ సినిమా ఆగస్ట్‌ 15న వరల్డ్‌ వైడ్‌గా విడుదల కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS