సెన్సేషన్స్‌కి భాషా బేధం లేదు. అందుకే ఇక్కడా, అక్కడా ఎక్కడనే తేడా లేకుండా సెన్సేషన్ న్యూస్ వైరల్ అవుతున్నాయి. ఈ పుణ్యమంతా సోషల్ మీడియాదే అని చెప్పక తప్పదు. గత కొన్ని రోజులుగా ఓ మలయాళ చిత్రానికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదే 'కన్ను గీటిన పాప - మనసు పారేసుకున్న బాబు'.. తెగ వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే కదా. అబ్బో ఈ అమ్మాయి - అబ్బాయి ఏమాత్రం తగ్గట్లేదండోయ్. ఇంకా ఇంకా ఎక్స్‌ప్రెషన్స్‌తో సంపేత్తున్నారంతే. మళ్లీ న్యూ ఎక్స్‌ప్రెషన్ ఒకటి బయటికి వచ్చింది. అదేంటంటారా?
ఈ సారి ముద్దు. అమ్మడు పెట్టిన ముద్దుకి అబ్బాయి గుండె గల్లంతయ్యిందే.. అది చూసిన కుర్రకారు గుండెలు బేజారవుతున్నాయే. ఇది కూడా క్లాస్ రూమ్ సీనే. ఇప్పుడిది ట్రెండింగ్‌లోకి వచ్చి చేరింది. మలయాళంలో 'ఒరు అదర్ లవ్' చిత్రంలోని ఒక్కో రొమాంటిక్ వీడియోని ఇలా రిలీజ్ చేస్తోంది చిత్ర యూనిట్. మలయాళ సినిమానే అయినప్పటికీ అన్ని చోట్లా వైరల్ అయిపోతోందీ సినిమా. యూత్‌ని బాగా అంటే బాగా..ఎట్రాక్ట్ చేసేస్తోంది. తాజాగా విడుదలైన ఈ ముద్దు వీడియోకి వస్తోన్న రెస్పాన్స్ మరీను. మామూలుగా లేదండోయ్. లైవ్ ఫీల్‌నిచ్చేస్తోంది. అందుకే అంతలా కుర్రకారు బేజారెత్తిపోతున్నారు. ప్రియా ప్రకాష్, రోషన్ అబ్దుల్ ఈ సినిమాలో నటించారు.
ఇంతకీ ఇక్కడ ఓ గ్లామర్ లేదూ.. నో టచ్చింగ్స్, నో హగ్గింగ్స్, బట్ వై దిస్ కొల'వెర్రి' అన్నట్లుగా మారింది ఈ వీడియో. ఇలా రిలీజ్ చేశారో లేదో, అప్పుడే రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చేస్తున్నాయ్. ఇదిలా ఉంటే, మరో పక్క కన్ను గీటిన వీడియో విషయంలో మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ ముశ్లిం సంఘాలు వివాదాలు రేపుతున్నాయి. అబ్బే..! వివాదాల్ గివాదాల్ జాన్తా నై.. ట్రెండింగ్‌లో ఉంటే, అది ఏ ఇష్యూ అయినా సరే దూసుకెళ్లిపోవడమే. దటీజ్ ది నయా ట్రెండ్.