‘లూసర్‌’ - చిరంజీవికి ఏకలవ్య శిష్యుడి ‘అంకితం’!

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవికి కోట్లాది మంది అభిమానులున్నారు.. వందలాది, వేలాది మంది ఏకలవ్య శిష్యులున్నారు. అలాంటి ఏకలవ్య శిష్యుల్లో తానూ ఒకడినంటున్నాడు నటుడు ప్రియదర్శి. తాజాగా ‘లూసర్‌’ అనే వెబ్‌సిరీస్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోన్న ప్రియదర్శి, ఈ వెబ్‌ సిరీస్‌ని మెగాస్టార్‌ చిరంజీవికి అంకితమిస్తున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించడం గమనార్హం. చిరంజీవి హీరోగా నటించిన ‘స్వయంకృషి’ సినిమా నుంచి ఓ ఫొటోని షేర్‌ చేసిన ప్రియదర్శి, దానికి తన ‘లూసర్‌’ సినిమా తాలూకు ఫొటోని జత చేశాడు.

 

‘చిరంజీవిగారికి గురుభ్యోనమః ఇది పోలిక కాదు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటూ మీ బాటలో నడిచి ఎంతో స్ఫూర్తిని పొందాను. నటనలో ఆవిష్కరించిన ఎన్నో కొత్త విధానాలు నాపై ఎంత ప్రభావాన్ని చూపించాయో మాటల్లో చెప్పడం సాధ్యం కాదు, అందుకే మీ ఏకలవ్య శిష్యుడిగా ఈ లూసర్‌ మీకు అంకితం’ అంటూ ట్వీట్‌ చేశాడు ప్రియదర్శి. ఇటీవలి కాలంలో ప్రియదర్శి స్టార్‌ కమెడియన్‌గానే కాదు, నటుడిగా భిన్నమైన పాత్రల్లో కన్పిస్తోన్న విషయం విదితమే. వెబ్‌ సిరీస్‌లపైనా తనదైన ముద్ర వేసేందుకు అడుగులేస్తోన్న ప్రియదర్శికి ‘లూసర్‌’ ఆశించిన విజయం దక్కాలని ఆశిద్దాం. ఓ వైపు సినిమాలు, ఇంకో వైపు వెబ్‌ సిరీస్‌లతో దూసుకెళ్తున్న ప్రియదర్శికి ‘గురువు’ మెగాస్టార్‌ చిరంజీవి నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ ‘లూసర్‌’ నిమిత్తం వస్తుందో వేచి చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS