పవన్ కల్యాణ్ కెరీర్‌ని గమనిస్తే... అందులో రీమేకులే ఎక్కువగా కనిపిస్తాయి. తమ్ముడు, సుస్వాగతం, అన్నవరం, తీన్ మార్, గబ్బర్ సింగ్ , కాటమరాయుడు, గోపాల గోపాల - ఇవన్నీ రీమేకులే. పవన్ సినిమాలు కూడా చాలా చోట్లకు రీమేకులుగా వెళ్లాయి. ఓ రకంగా పవన్ కూడా రీమేకుల స్పెషలిస్టే. తన కొత్త ఇన్నింగ్స్ కూడా రీమేకుతో మొదలెడుతున్నాడు. పింక్ ని పవన్ కోసం ఇప్పుడు రీమేక్ చేస్తున్నారు. ఓ రకంగా పవన్‌కి ఇదే సేఫ్. ఎందుకంటే... టాప్ హీరో సినిమా ఏదైనా సరే, కోట్లతో ముడిపడిన వ్యవహారం. ఏమాత్రం తేడా కొట్టినా, నిర్మాత రోడ్డుమీదకు వస్తాడు. అలాంటప్పుడు సేఫ్ ప్రాజెక్టుల్ని ఎంచుకోవడమే ఉత్తమం. పైగా పవన్ రీమేక్ కథతో ఎప్పుడు హిట్టు కొట్టినా, అవి మాతృక కంటే మిన్నగా ఉంటాయి. కాబట్టి.. పవన్ రీమేకులు ఎంచుకోవడం ఆక్షేపణలేం కనిపించవు.
ఇప్పుడు మరో మలయాళ రీమేక్‌పై కూడా పవన్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. డ్రైవింగ్ లైసెన్స్ సినిమాపై పవన్ దృష్టి పెట్టినట్టు లేటెస్ట్ టాక్. `వేదాళం` రీమేక్ కూడా పవనే చేస్తాడని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. అయితే ఆ రీమేక్‌పై ఇప్పటి వరకూ స్సఫ్టత లేదు. తక్కువ సమయంలో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలన్నది పవన్ అభిమతం. ఇప్పటికిప్పుడు పవన్ కోసం కథలు అల్లి, పవన్‌కి నచ్చేలా స్క్రిప్టు తయారు చేయడమంటే బోలెడంత కాలయాపన. అందుకే రిస్కు తక్కువగా ఉన్న రీమేకులే ఎంచుకుంటున్నాడు. మరో విశేషం ఏమిటంటే.. ఈ రీమేకులన్నీ పరిమిత బడ్జెట్‌లో, తక్కువ సమయంలో పూర్తయ్యే కథలే. అందుకే పవన్ వీటిపై దృష్టి పెట్టాడేమో?