‘ఎవరే అతగాడు’ సినిమాతో తెలుగులోకి డెబ్యూ చేసిన ముద్దుగుమ్మ ప్రియమణి. తర్వాత ‘పెళ్లైన కొత్తలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ‘యమదొంగ’, ‘హరే రామ్’ తదితర చిత్రాల్లో నటించింది. తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ బిజీగా ఉండే ప్రియమణి ఈ మధ్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. బుల్లితెరపై ఓ డాన్స్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తూ, అప్పుడప్పుడూ కొన్ని వాణిజ్య ప్రకటనల్లో మెరుస్తూ మురిపిస్తోంది. అయితే, ప్రస్తుతం బిజీయెస్ట్ హీరోయిన్స్‌లో ప్రియమణి ఒకరుగా మారిపోయింది.
దాదాపు అరడజనుకు పైగా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగులోనే మూడు సినిమాలున్నాయి. వాటిలో స్టార్ హీరో వెంకీ సరసన ‘నారప్ప’ చిత్రంలో హీరోయిన్‌గా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. మరోవైపు దగ్గుబాటి కాంపౌండ్ హీరో రానాతో ‘విరాటపర్వం’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇది కాక, ఆమె లీడ్ రోల్‌లో ‘సిరివెన్నెల’ అనే ఓ విభిన్నమైన చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇవే కాక, తమిళంలో జయలలిత బయోపిక్ ‘తలైవి’లో జయలలితకు అత్యంత సన్నిహితురాలైన ‘శశికళ’ పాత్ర పోషిస్తోంది. హిందీ విషయానికి వస్తే, అజయ్ దేవగణ్ సరసన ‘మైదాన్’లో హీరోయిన్‌గా నటిస్తోంది. చూస్తే అన్నీ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులే. సడెన్‌గా ప్రియమణికి అవకాశాలు పోటెత్తుతున్నాయి. ఇవే కాదు, తెలుగులో మరిన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయట. మొత్తానికి చిన్న బ్రేక్ తీసుకుంటే మాత్రం, భలే ఛాన్సులు పట్టేస్తోందిలే ప్రియమణి.