ఆర్‌ఆర్‌ఆర్‌ దెబ్బకి ఈక్వేషన్లు మారిపోతాయా?

మరిన్ని వార్తలు

తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న చిత్రాల్లో ఒకటిగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించి చెప్పుకోవచ్చు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ పాన్‌ ఇండియా సినిమాలో మెగా పవర్‌ స్టార్‌ రావ్‌ు చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్నారు. బాలీవుడ్‌ నుంచి అజయ్‌ దేవగన్‌, అలియా భట్‌ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వివిధ భాషల నుంచి మేటి నటీనటులు ఈ సినిమాలో కన్పించనున్న విషయం విదితమే. హాలీవుడ్‌ నుంచి కూడా నటుల్ని ఎంపిక చేశారు రాజమౌళి ఈ విజువల్‌ వండర్‌ కోసం.

 

నిజానికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఈ ఏడాది జులై నెలాఖరున విడుదల కావాల్సి వుంది. అయితే, 2021 సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్ర నిర్మాత. దాంతో, ఒక్కసారిగా టాలీవుడ్‌లో ఈక్వేషన్స్‌ మారిపోతున్నాయి. 2021 సంక్రాంతి కోసం చాలా సినిమాలు దాదాపుగా లైన్‌ క్లియర్‌ చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సంక్రాంతి రేసులోకి రావడంతో మొత్తంగా ఆలోచలన్నీ మారిపోయే అవకాశముంది టాలీవుడ్‌లో. చరణ్‌, ఎన్టీఆర్‌ మాత్రమే కాదు, ఈ సినిమాకి రాజమౌళి మరో స్టార్‌ ఎట్రాక్షన్‌.

 

రాజమౌళి సినిమాలతో పోటీ అంటే, దానికి ఎవరూ ఇష్టపడరు. తెలుగు సినీ పరిశ్రమలో అందరికీ అత్యంత ఆప్తుడు రాజమౌళి. సో, 2021 సంక్రాంతికి ఒకటి రెండు చిన్న సినిమాలు తప్ప.. పెద్ద సినిమాల హడావిడి వుండకపోవచ్చు. ఈ సంక్రాంతికి విడుదలైన రెండు పెద్ద సినిమాల మధ్య వసూళ్ళ పోటీ ఎంత తీవ్రంగా నడిచిందో చూశాం. మరి, 2021 సంక్రాంతి ఏమవుతుందో వేచి చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS