అర్థ‌రాత్రి హోటెల్ రూమ్‌కి వ‌చ్చాడ‌ట‌

By Gowthami - April 09, 2020 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

స్వ‌త‌హాగా వివాదాల‌కు దూరంగా ఉండే క‌థానాయిక ప్రియ‌మ‌ణి. అయితే ఆమెపై ఓ రూమ‌ర్ గ‌ట్టిగానే చ‌క్క‌ర్లు కొట్టింది. సెల‌బ్రెటీ క్రికెట్ లీగ్ సంద‌ర్భంగా ఓ క్రికెట‌ర్‌పై ప్రియ‌మ‌ణి చేయి చేసుకుంద‌ని, చెంప‌దెబ్బ కొట్టింద‌ని ఓ పుకారు షికారు చేసింది. దీనిపై ఎట్ట‌కేల‌కు ప్రియ‌మ‌ణి స్పందించింది. సెల‌బ్రెటీ క్రికెట్ లీగ్ సంద‌ర్భంగా ఓ క్రికెట‌ర్ త‌న‌ని బాగా ఇబ్బంది పెట్టాడ‌ని ఒప్పుకుంది. త‌న ఫోన్ తీసుకుని, ఫ్రాంక్ చేశాడ‌ని ఆ త‌ర‌వాత ఓ రోజు అర్థ‌రాత్రి హోటెల్ రూమ్‌కి కూడా వ‌చ్చి, ఏడిపించాల‌ని చూసాడని  త‌న ప్ర‌వ‌ర్త‌న త‌న‌కు ఏమాత్రం న‌చ్చ‌లేద‌ని.. ఈ చేదు సంఘ‌ట‌న‌ని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేన‌ని అంది. కాక‌పోతే... ఆ క్రికెట‌ర్‌పై తాను చేయి చేసుకోలేద‌ని క్లారిటీ ఇచ్చింది.

 

ఇందులో ఉన్న ట్విస్టు ఏమిటంటే.. ఆ క్రికెట‌ర్ పేరు చెప్ప‌డానికి ప్రియ‌మ‌ణి స‌ముఖ‌త చూపించ‌డం లేదు. `అది అయిపోయిన ఎపిసోడ్. గ‌తాన్ని త‌వ్వుకోవ‌డం నాకు ఇష్టం లేదు` అనేసింది. దాంతో.. ఆ క్రికెట‌ర్ ఎవ‌రన్న విష‌యం మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS