మన హీరోలు ఇప్పుడు కేవలం తెలుగు మార్కెట్ గురించే ఆలోచించడం లేదు. సౌత్, నార్త్ ... ఇలా రెండు చోట్లా పాగా వేయాలని భావిస్తున్నారు. అల్లు అర్జున్ ఈ విషయంలో కాస్త ముందే మేల్కొన్నాడు. తన సినిమాని మలయాళంలో రీలీజ్ చేసి, అక్కడ కూడా సూపర్ హిట్లు కొట్టాడు. తమిళ నాట బన్నీ ప్లాన్ వర్కవుట్ కాలేదు గానీ, మలయాళంలో బన్నీ పెద్ద స్టార్ అయిపోయాడు. ఇప్పుడు మిగిలిన భాషలతో పాటు.. హిందీలోనూ అడుగుపెట్టాలన్నది బన్నీ ఆలోచన. కాకపోతే అందుకు అనువైన స్క్రిప్టు కోసం ఎదురు చూస్తున్నాడంతే. ఇప్పుడు సుకుమార్ సినిమా `పుష్ష`తో అందుకు రూట్ క్లియర్ అయ్యింది.
ఈ సినిమాని మిగిలిన భాషలతో పాటు హిందీలోనూ విడుదల చేయాలన్న ఆలోచనలో ఉంది చిత్రబృందం. నిజానికి ఈ ప్లాన్ సుకుమార్‌ది. బన్నీని బాలీవుడ్ లోకి ఇంట్రడ్యూస్ చేయడానికి పుష్ష లాంటి కథే సరైనదని సుకుమార్ నమ్మాడు. బన్నీని సైతం ఒప్పించాడు. సుకుమార్ మాటపై నమ్మకం ఉన్న బన్నీ.. అందుకు ఒప్పుకన్నాడు. నిజానికి ఈ సినిమా మొదలెట్టేముందు బాలీవుడ్ ఆలోచనే లేదు బన్నీకి. కానీ సుకుమార్ మాస్టర్ మైండ్ వల్ల ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లోనూ వెళ్లబోతోంది.