ప్రియమణి సెకండ్‌ ఇన్నింగ్స్‌: యాక్షన్‌ ఛార్జ్‌ తీసుకుంది!

మరిన్ని వార్తలు

ఫ్యామిలీ హీరోయిన్‌గానే కాదు, కమర్షియల్‌ అండ్‌ హాట్‌ భామగానూ ప్రియమణికి మంచి పేరుంది. యంగ్‌ హీరోస్‌తో పాటు, ఎన్టీఆర్‌ వంటి స్టార్‌ హీరోలతోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ప్రియమణి, గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం బుల్లితెరపై ఓ ప్రముఖ ఛానెల్‌ నిర్వహిస్తోన్న డాన్స్‌ ప్రోగ్రాంకి జడ్జిగా వ్యవహరిస్తోంది. అయితే, ఈ మధ్యనే ప్రియమణికి మళ్లీ సినిమాల్లో అవకాశాలు క్యూ కట్టాయి. ప్రియమణి ప్రధాన పాత్రలో 'సిరివెన్నెల' అనే సినిమా తెరకెక్కింది.

 

హారర్‌ బేస్‌డ్‌ మూవీ అయిన ఈ సినిమాలో ప్రియమణి యాక్షన్‌ సీన్లు ఇరగదీసేస్తోంది. ప్రకాష్‌ పులిజల ఈ సినిమాకి దర్శకుడు. 'మహానటి' ఫేం బేబీ సాయి తేజస్విని ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, మరోవైపు ప్రియమణి రానా హీరోగా తెరకెక్కుతోన్న 'విరాటపర్వం' సినిమాలో ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. నక్సలిజం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలోనూ ప్రియమణి పవర్‌ఫుల్‌ అండ్‌ యాక్షన్‌ రోల్‌ పోషిస్తోందట.

 

ఇదో రియలిస్టిక్‌ క్యారెక్టర్‌ అనీ తెలుస్తోంది. ఈ క్యారెక్టర్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ప్రియమణికి మంచి గుర్తింపు తీసుకొస్తుందనీ అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రియమణికి ఈ తరహాలో మరిన్ని ఆఫర్స్‌ వస్తున్నాయట. అయితే, ఒకే ఫ్లేవర్‌ని యాక్‌సెప్ట్‌ చేయకుండా, డిఫరెంట్‌ రోల్స్‌లో నటించేందుకు ప్రియమణి ఆసక్తి చూపుతోందట. మొత్తానికి హీరోయిన్‌గా గ్లామర్‌ డాళ్‌ అనిపించుకున్న ప్రియమణి సెకండ్‌ ఇన్నింగ్స్‌లో యాక్షన్‌ గాళ్‌ అనిపించుకునేందుకు చేస్తున్న ప్రయత్నం ఎలాంటి ఫలితాలిస్తుందో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS