వేగం పెంచిన సుకుమార్‌!

By iQlikMovies - July 23, 2019 - 09:30 AM IST

మరిన్ని వార్తలు

'రంగస్థలం' వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన సుకుమార్‌ తదుపరి సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు. 'రంగస్థలం' తర్వాత సుకుమార్‌, మహేష్‌తో సినిమా చేయాలనుకున్నాడు. అందుకు అటూ ఇటూగా స్క్రిప్టు కూడా సిద్ధం చేసుకున్నాడు. కానీ, మహేష్‌ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సుకుమార్‌తో సినిమా చేయడానికి సిద్ధంగా లేకపోవడంతో, ఆ ప్లేస్‌ని అల్లు అర్జున్‌కిచ్చేశాడు సుకుమార్‌. అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కాంబినేషన్‌కి ఫుల్‌ క్రేజ్‌ ఉన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌కి 'ఆర్య' వంటి హిట్‌ ఉంది సుకుమార్‌ కాంబోలో.

 

సో ఈ కాంబినేషన్‌ అంటే అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి సుకుమార్‌ ఇంకా స్క్రిప్టు పూర్తిగా సిద్దం చేయలేదట. సుకుమార్‌ చెప్పిన స్టోరీ లైన్‌ బన్నీకి తెగ నచ్చేయడంతో, ఆయిన్ని లాక్‌ చేసి పెట్టాడు. మహేష్‌తో సినిమా నాట్‌ ఓకే కావడంతో, బన్నీ సినిమాతో ఎలాగైనా సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టాలనే కసి మీదున్నాడట సుకుమార్‌. ఆ దిశగా స్టోరీని పవర్‌ఫుల్‌గా డెవలప్‌ చేస్తున్నాడట. ఇప్పలికే ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఇంతవరకూ వచ్చిన స్క్రిప్టు బన్నీకి వినిపించగా, ట్రెమండస్‌ రెస్పాన్స్‌ ఇచ్చాడట బన్నీ.

 

ఎప్పుడెప్పుడు ఈ సినిమాలో నటించాలా.? అనే క్యూరియాసిటీని వ్యక్తం చేశాట. ఆ రేంజ్‌లో సుకుమార్‌ స్టోరీ ఉందట. వీలైనంత ఎర్లీగా మిగిలిన స్క్రిప్టు పూర్తి చేయమనీ, సుకుమార్‌కి సూచించాడట. బన్నీ జోరు చూసి, సుకుమార్‌ మరింత వేగం పెంచాడట. త్వరలోనే పూర్తి స్క్రిప్టుతో, సినిమాని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట సుకుమార్‌ అండ్‌ టీమ్‌. ప్రస్తుతం బన్నీ, త్రివిక్రమ్‌ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కావడంతో సంబంధం లేకుండానే అన్నీ కుదిరితే సుకుమార్‌ సినిమా పట్టాలెక్కనుందనీ తాజా సమాచారమ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS