భారతకాలమానం ప్రకారం నేటి ఉదయం అమెరికాలోని న్యూయార్క్ లో ఒక తీవ్రవాది సామన్య ప్రజలే లక్ష్యంగా ట్రక్ ని నడుపుకుంటూ వాటితో వారిని చంపే ప్రయత్నం చేశాడు.
ఈ ఊహించని ఘటనతో ఒక్కసారిగా అమెరికా సహా యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. ఈ సంఘటనలో మొత్తం 8మంది ప్రాణాలు కోల్పోగా, ఈ దాడికి యత్నించిన దుండగుడు పోలిసుల కాల్పుల్లో గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అయితే ఈ ఘటన మొత్తం ప్రియాంక చోప్రా నివసిస్తున్న ఇంటి సమీపంలోనే జరగడంతో ఆమె భయాందోళనలకి గురైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం అమెరికాలో ఒక టెలివిజన్ షోలో నటిస్తున్న విషయం అందరికి విదితమే.