సోషల్ మీడియాలో ఈ ఫొటోని షేర్ చేసిన ప్రియాంక, తన ఫొటో గురించి చెబుతూ, తన కెరీర్‌లో ఇదే బెస్ట్ ఎవర్ హాట్‌నెస్ అని పేర్కొంది. అందంలో తన అభిప్రాయమేంటని అడిగితే, అందం అనేది ఎక్స్‌పోజింగ్‌లో ఉండదని చెప్పింది ప్రియాంక. ఫొటో సెషన్ డిఫరెంట్‌గా ఉండేందుకోసం రకరకాల కాన్సెప్ట్స్ ఎంచుకుంటారనీ వాటితో హీరోయిన్స్ ఆటిట్యూడ్‌ని అంచనా వేయకూడదనీ చెప్పుకొచ్చింది. ఇంతవరకూ తాను దిగిన డిఫరెంట్ ఫోటో సెషన్స్‌లో ఈ బ్లాక్ అండ్ వైట్ కాన్సెప్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్ అని ఈ హాట్ బ్యూటీ అభిప్రాయపడింది. టూ పీస్ బికినీ వేసుకుని కన్పించడం అంటే అది ఆ సన్నివేశానికి సంబంధించినది మాత్రమేనని వివరించింది. హాలీవుడ్‌కి వెళ్ళినా, తానొక భారతీయ మహిళనన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోనని చెప్పింది. వేసుకునే దుస్తుల్ని బట్టి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని అంచనా వేయకూడదని ముద్దుగుమ్మ ప్రియాంకా చోప్రా కొంచెం ఎక్కువగానే క్లాస్ తీసుకుంది. బాలీవుడ్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి, హాలీవుడ్‌కి వెళ్ళిన ప్రియాంక అక్కడా మంచి విజయాల్ని సొంతం చేసుకుంటోంది. డబ్బూ రత్నానీ క్యాలెండర్ కోసం ఇదిగో ఇలా హాట్ హాట్ అందాలతో ఇన్నోవేటివ్‌గా దర్శనమిచ్చింది హాట్ హాట్ ప్రియాంకా.