వయసులో తనకన్నా చాలా చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ని వివాహమాడి అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకుంది దేశీ బ్యూటీ ప్రియాంకా చోప్రా. దేశీ గాళ్‌గా ప్రియాంకకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పెళ్లయ్యాక కూడా ఆమె క్రేజ్ మరింత పెరిగిందే కానీ, ఎంత మాత్రమూ తగ్గలేదు. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాల పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టిన ప్రియాంకా చోప్రా భర్త నిక్‌తో కలిసి అక్కడే మకాం పెట్టేసింది. ఆల్రెడీ హాలీవుడ్ సినిమాలకు సుపరిచితురాలైన ప్రియాంకా ఇకపై అక్కడే సెటిలైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.
నిక్‌తో కలిసి అక్కడ పార్టీలూ, ఫంక్షన్లూ ఎంజాయ్ చేస్తూ, వీలు చిక్కితే అవకాశాల కోసం ట్రై చేస్తూ ఇటు పర్సనల్ లైఫ్‌నీ, అటు కెరీర్‌నీ బ్యాలెన్స్ చేస్తోంది. అప్పుడప్పుడూ వీలు చిక్కినప్పుడల్లా ఇదిగో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కోసం అందమైన పిక్స్ పోస్ట్ చేస్తూ హల్చల్ చేస్తోంది. అలా తాజాగా ప్రియాంక పోస్ట్ చేసిన ఈ పిక్కి ఓ రేంజ్లో రెస్పాన్స్ వస్తోంది. లైట్ కలర్ కాస్ట్యూమ్‌లో హాట్ క్లీవేజ్‌ని ఎక్స్పోజ్ చేస్తూ, తన నీలి ముంగురులను అలా అలా చేతితో సర్దుకుంటూ ఆకాశం వైపు చూస్తున్న ప్రియాంకా స్టిల్ నిజంగా సింప్లీ సూపర్బ్.