ఈ టాలీవుడ్ సినిమా ఎటు వెళ్లిపోతుందో అర్ధం కావడం లేదు 'ఆర్ ఎక్స్ 100', అర్జున్‌రెడ్డి' పుణ్యమా అని బోల్డ్ కంటెంట్ లేకుండా తెలుగు సినిమా ఉండడం లేదు. లిప్‌లాక్స్ తెలుగు సినిమాకి కంపల్సరీ అయిపోయాయి అంటూ జీవిత మండిపడ్డారు. ఇంతకీ ఇదంతా ఎందుకంటే, 'డిగ్రీ కాలేజ్' సినిమా ట్రైలర్ లాంఛింగ్‌కి ముఖ్య అతిధిగా విచ్చేశారు జీవితా రాజశేఖర్.
ఈ సందర్భంగా ఆమె ఈ సినిమా డైరెక్టర్‌కీ, టెక్నీషియన్స్‌కీ గట్టిగా గిల్లి వెన్న పూసినట్లుగా వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలకు మహిళలు రారు అని ఆమె తేల్చేశారు. అంతేకాదు, బోల్డ్ సినిమాల పేరుతో చూపిస్తున్న విచ్చలవిడి శృంగారం గురించి కూడా ఆమె ఘాటు విమర్శలు చేశారు. బోల్డ్ సన్నివేశాల్ని సెన్సార్ చేస్తారు కదా అనుకుంటే, పొరపాటే. సెన్సార్‌లో కూడా కట్ చేయలేని సీన్లుంటున్నాయి. సెన్సార్ చేసేముందు ప్రొడ్యూసర్లు గుర్తుకొస్తారు. వారు ఖర్చుపెట్టిన మొత్తం, టెక్నీషియన్స్ కష్టం గుర్తుకొస్తుంది. సో ఒక సినిమాని తెరకెక్కించే ముందు కనీస సోషల్ రెస్పాన్సిబులిటీని గుర్తుంచుకోవాలి అని జీవిత అన్నారు.
సోషల్ మీడియాలోనూ కుప్పలు తెప్పలుగా బోల్డ్ కంటెంట్ ఉంటోంది కదా అని కొందరు వాదిస్తారు అయితే కంప్యూటర్లు మనం మన రూమ్‌లో కూర్చొని చూస్తాం, కానీ సినిమా అలా కాదు, వంద మంది కలిసి కూర్చొని చూస్తారు. శృంగారం అనేది నలుగురిలో కూర్చొని చేయం కదా అది అసభ్యంగా ఉంటుంది అంటూ జీవిత మండిపడ్డారు. చివరిలో నేను ఈ మాటలను ఏదో కాంట్రవర్సీ కోసం మాట్లాడడం లేదు. నాకు అలా అనిపించింది. చెప్పానంతే అని ముగించారు. జీవిత వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.