ప్రియాంక చోప్రా చేస్తున్న పలు సామాజిక సేవా కార్యక్రమాలని గుర్తిస్తూ ఆమెకి మదర్ థెరిసా అవార్డుని ప్రకటించారు. ఈ అవార్డు ఆమె తరపున ఆమె తల్లి మధు చోప్రా అందుకున్నారు.
తన కూతురుకి ఇంతటి గొప్ప అవార్డుని లభించినందుకు తనకి చాలా ఆనందంగా ఉందన్నారు. ఇప్పటికే ఆమె పలు స్వచ్చంద సంస్థలకి గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఆమె విరాళాలు కూడా భారీ స్థాయిలోనే చేస్తుంటుంది అని ఆమె సన్నిహితులు ఎప్పుడు చెబుతుంటారు.
ఇక ప్రియాంక ఇటు హిందీ చిత్రాలతో పాటుగా అటు హాలీవుడ్ ప్రాజెక్ట్స్ ని కూడా చేస్తున్నది. ఈ మధ్యనే ఆమె ఆసియా మొత్తంలోనే శృంగార మహిళగా టైటిల్ కూడా సొంతం చేసుకుంది.
ఏదేమైనప్పటికీ ప్రియాంక చోప్రా ఇటు గ్లామర్ పరంగా అటు ఒక బాధ్యత కలిగిన సెలబ్రిటీ గా కూడా రెండు రకాలుగా ముందుకి సాగిపోతున్నది.