దేశీ బ్యూటీగా పాపులర్ అయిన ప్రియాంకా చోప్రాకి ఎదురే లేకుండా పోయింది. ఆమె ఏం చేసినా స్టైలే. ఎలా కనిపించినా ట్రెండే.. అలా అయిపోయిందిప్పుడు. కత్తిలాంటి అమెరికా కుర్రోడు నిక్‌ని వివాహం చేసుకున్నాక ప్రియాంకా క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రియాంకా ఎక్కడ కనిపించినా, అదో సెన్సేషన్ అయిపోతోంది. అందుకు తగ్గట్లుగానే ప్రియాంకా కూడా ఎప్పటికప్పుడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఇక తాజాగా మెట్‌గలా అనే ఓ ఈవెంట్‌లో ప్రియాంకా కనిపించిన తీరుకు మిశ్రమ రెస్పాన్స్ వస్తోంది. చింపిరిగా కనిపిస్తున్న జుట్టు, అఫ్‌కోర్స్ స్టైలిష్ హెయిర్ స్టైల్ అనుకోండి.. ట్రాన్స్‌పరెంటెడ్ కాస్ట్యూమ్‌లో డిఫరెంట్ ఐ షేడ్స్ ఇలా ఓ విచిత్రమైన వేషధారణలో కనిపించి షాకిచ్చింది.
ఈ గెటప్ చూసి ప్రియాంకాని కొందరు ఏకి పారేస్తుంటే, మరికొందరేమో స్టైల్ ఐకాన్ ప్రియాంకా అంటున్నారు. ఇంత స్టైలిష్‌గా ప్రియాంకా కనిపిస్తుంటే, ఆ పక్కనే అమాయకంగా చూస్తూ నిలబడ్డాడు ఆమె భర్త నిక్. ఇదిలా ఉంటే, ఇదే ఈవెంట్‌కి అటెంట్ అయిన మరో ముద్దుగుమ్మ దీపికా పదుకొనెకు ప్రశంసలు దక్కుతున్నాయి. బార్బీ గాళ్‌లా లాంగ్ ఫ్రాక్ ధరించి, అచ్చు బార్బీ బొమ్మను పోలిన హెయిర్ స్టైల్‌తో తళుక్కున మెరిసి, అందర్నీ విశేషంగా ఆకర్షించింది దీపికా పదుకొనె. బాలీవుడ్‌లో ఈ ఇద్దరూ స్టార్ హీరోయిన్లే. హాలీవుడ్‌ని టచ్ చేసి వచ్చినవారే. ప్రస్తుతం దీపికా బాలీవుడ్‌లో బిజీగా గడుపుతోంది. ప్రియాంకా మాత్రం హాలీవుడ్‌లో పాగా వేసేందుకే ట్రై చేస్తోంది.