'భంగిమ' పిల్లాడూ హిట్‌ కొట్టేస్తానంటున్నాడూ!

మరిన్ని వార్తలు

కమల్‌హాసన్‌, జయప్రద జంటగా తెరకెక్కిన సూపర్‌ హిట్‌ సినిమా 'సాగరసంగమం' గుర్తుంది కదా. ఈ సినిమాలో కమల్‌హాసన్‌ వెనకాల గురు.. గురు.. అంటూ తిరుగుతూ, 'భంగిమా..' అంటూ హీరో, హీరోయిన్స్‌కి ఫోటోలు తీసే ఉంగరాల జుట్టు కుర్రాడు గుర్తున్నాడా? ఆ పిల్లాడు ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా? గెస్‌ చేయండి. ఆ వయసులోనే 'భంగిమా..' అంటూ పెద్ద డైరెక్టర్‌గా ఫీలయిపోయిన ఆ బుడ్డోడు నిజంగానే పెరిగి పెద్దయ్యాక డైరెక్టర్‌ అయ్యాడు.

 

ఇంతకీ ఈ కుర్రోడు.. అదేనండీ మన డైరెక్టర్‌గారి పేరేంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం.. పేరు చక్రి తోలేటి. ఆల్రెడీ 'ఈనాడు', 'బిల్లా 2' తదితర చిత్రాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం మరో సినిమాకి దర్శకత్వం వహించేశాడు. సైలెంట్‌గా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసేశాడు. మనోడు తెరకెక్కించిన సినిమాల్లో హీరోలేమీ ఆషామాషీ హీరోలు కాదు కదా. ప్రస్తుత సినిమాలో హీరోగా ప్రభుదేవా నటిస్తున్నాడు. సినిమా పేరు 'కామోషీ'.

 

ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోందండోయ్‌. ఇంతకీ ఇది తెలుగు సినిమా కాదు, బాలీవుడ్‌ మూవీ. ఎలాగైనా ఈ సినిమాతో గట్టి హిట్టు కొడతానంటున్నాడు చక్రి తోలేటి. అన్ని పనులూ పూర్తి చేసుకుని ఈ సినిమా మే 31న విడుదలకు కూడా సిద్ధమైపోయింది. ఇదిలా ఉంటే, మరోవైపు ప్రభుదేవా, తమన్నా కాంబినేషన్‌లో 'అభినేత్రి 2' సినిమా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. మే 1న విడుదల కావాల్సిన ఈ సినిమా మే 31కి వాయిదా పడింది. అంటే ఒకే కాంబినేషన్‌లో రెండు సినిమాలు ఇటు తెలుగులోనూ, అటు హిందీలోనూ ఒకేసారి విడుదలవుతున్నాయన్న మాట. ప్రభుదేవా - తమన్నాకిది డబుల్‌ ధమాకా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS