ఆస్కార్ వేడుకలో ప్రియాంకా చోప్రా డ్రస్సు గురించే మాట్లాడారు అంతా. వైట్ అండ్ గ్రే డిఫరెంట్ డ్రస్సులో ప్రియాంకా మెరిసిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆమె అలా స్టేజ్‌పై సందడి చేసిందో లేదో వెంటనే సోషల్ మీడియాలో ఆమె డ్రస్సుపై ప ఘాటు, ఘాటు సెటైర్లు స్టార్ట్ అయిపోయాయి. డ్రస్సు అందంగానే ఉంది. ఎందుకో మరి అభిమానులకు నచ్చలేదు. సరికదా అస్సలు ఊరుకోలేదు కూడా. కామెంట్ల మీద కామెంట్లతో మోత మోగించేశారు. దాంతో ఎందుకొచ్చిన గొడవలే అనుకుందో ఏమో ముద్దుగుమ్మ ప్రియాంకా చోప్రా డ్రస్సు ఛేంజ్ చేసేసింది. ఆ తర్వాత ఇలా బ్లాక్ ఫ్రాక్‌లో మరింత హాట్ అప్పీల్‌తో ఎట్రాక్ట్ చేసింది. అప్పుడు గానీ శాంతించలేదు ఫ్యాన్స్. ఏ మాటకామాటే చెప్పాలి. ఈ బ్లాక్ డ్రస్సులో మాత్రం ప్రియాంకా అందాలు ముగ్దమనోహరంగా ఉన్నాయంటే నమ్మాల్సిందే!
ALSO SEE :
PRIYANKA CHOPRA AT OSCARS 2017