ప్రియా - నిక్‌పై 'పెటా' గుసా.. వై దిస్‌ కొలెవరీ.!

మరిన్ని వార్తలు

సోషల్‌ మీడియా వచ్చాక సెలబ్రిటీల్ని ఊరికే అస్సలు వదిలి పెట్టడం లేదు. వారు ఏం చేసినా అదో సెన్సేషన్‌ అయినా అయిపోతోంది. లేదంటే కాంట్రవర్సీ అయినా అయిపోతోంది. సెన్సేషన్‌ అయితే ప్రాబ్లమ్‌ లేదు. కాంట్రవర్సీ అయితేనే తంటా. అసలు విషయంలోకి వెళితే తాజాగా దేశీ బ్యూటీ ప్రియాంకా చోప్రా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అమెరికన్‌ గాయకుడు నిక్‌ జొనాస్‌ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ పెళ్లి వేడుకల్లో ప్రియాంకా - నిక్‌ మాస్త్‌ జోరుగా ఉన్నారు.

అయితే పెళ్లి వేడుకల్లో భాగంగా ప్రియాంకా, నిక్‌లు ఏనుగు, గుర్రంపై ఊరేగి రావడం, జంతువులను అనవసరంగా ఇబ్బంది పెట్టడమే అని జంతు ప్రేమికులు గుస్సా అవుతున్నారు. అంతేకాదు, పెళ్లి సందర్భంగా క్రాకర్స్‌ ఎక్కువగా పేల్చడంతో పర్యావరణ ప్రేమికులు కూడా ఈ కొత్త జంటపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నేషనల్‌ సెలబ్రిటీలైన వీరు నలుగురుకి ఆదర్శంగా ఉండాల్సింది పోయి, ఇలా సమాజానికి కీడు చేసే పనులు చేయడం ఏమీ బాగా లేదని సోషల్‌ మీడియాలో ఆమె అభిమానుల్లో కొంతమంది తీవ్రంగా ట్రాలింగ్‌ చేస్తున్నారు.

మరికొందరు ప్రియాంకా పెళ్లి వేడుకలకు సంబంధించి బయటికి వచ్చిన ఫోటోలు చూసి పండగ చేసుకుంటున్నారు. రకరకాల డిజైనర్‌ కాస్ట్యూమ్స్‌లో ప్రియాంకా అందం చూపు తిప్పుకోనీయకుండా చేస్తోందని మురిసిపోతున్నారు. క్రిస్టియన్‌, హిందూ సాంప్రదాయంలో వివాహం చేసుకున్న ప్రియాంకా త్వరలో ముంబయ్‌లో గ్రాండ్‌ రిసెప్షన్‌ ఇవ్వనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS