ప్రియాంకా చోప్రా పెళ్లి ముహూర్తం దాదాపు ఖరారయిపోయినట్లే. నవంబర్ లేదా డిశంబర్‌లో ప్రియాంకా వివాహం ఉండనుందని బాలీవుడ్ వర్గాల సమాచారమ్. ఆల్రెడీ పెళ్లి పనుల్లో ప్రియాంకా ఫ్యామిలీ బిజీగా ఉందట. అమెరికన్ సింగర్ కమ్ నటుడు నిక్ జోనాస్‌తో గత కొంత కాలంగా ప్రియాంకా చోప్రా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.
ఇటీవలే నిక్‌ని ముంబయ్‌లోని తన ఫ్యామిలీకి పరిచయం చేసింది ప్రియాంకా చోప్రా. సినిమాల నిమిత్తం ప్రియాంకా చోప్రా హాలీవుడ్‌లో బస చేసిన తరుణంలోనే ఈ ఇద్దరి మధ్యా పరిచయం ఏర్పడడం, ఆ పరిచయం ప్రేమగా మారడం, ఇప్పుడు పెళ్లి పీటల దాకా చేరింది. నిక్ కన్నా ప్రియాంకా చోప్రా వయసులో దాదాపు 11 ఏళ్లు పెద్దది కావడం విశేషం. ప్రియాంకా పెళ్లి వార్తతో బాలీవుడ్‌లో సందడి వాతావరణం నెలకొంది.
ఇటీవల బాలీవుడ్ ముద్దుగుమ్మలు చాలా మంది పెళ్లి చేసుకుని ఓ ఇంటివారవుతున్నారు. పెళ్లి తర్వాత కూడా ఓ వైపు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ, మరోవైపు నటనను కూడా ఎలాంటి విఘ్నం లేకుండా కొనసాగిస్తున్నారు. అలాగే ప్రియాంకా చోప్రా కూడా పెళ్లి తర్వాత సినిమాలు కొనసాగిస్తుందట. ఈ మధ్యనే హాలీవుడ్ నుండి తిరిగొచ్చిన ప్రియాంకా బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది.
పెళ్లి కారణంగా తాను చేయాల్సిన కొన్ని సినిమాల నుండి తాత్కాలికంగా కాస్త బ్రేక్ తీసుకుంది. అయితే కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో ప్రియాంక చేయాల్సిన 'భారత్' సినిమా నుండి మాత్రం పూర్తిగా తప్పుకుంది. ప్రస్తుతం ప్రియాంకా, నిక్ జంట విదేశాల్లో వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తున్నారు.