గీత మాధురి బిగ్ బాస్ ఇంటిలో ఈ సీజన్ విన్నర్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయన్న భావన షో వీక్షిస్తున్న చాలామందిలో ఉంది. దీనికి కారణం ఆమె ఇంటిలో జరిగిన చాలా సన్నివేశాల్లో న్యాయంగా మాట్లాడడం, తన నిర్ణయాలని ఏదో ఒక వైపు కాకుండా సరైన నిర్ణయం చెబుతుంది అన్న పేరు వచ్చేసింది.
ఇక బాబు గోగినేని విషయానికి వస్తే, బిగ్ బాస్ ఇంటిలో మిగతా పార్టిసిపెంట్స్ అంత యాక్టివ్ కాకపోయినా తన అభిప్రాయాలని, తన మార్కుని కచ్చితంగా చూపిస్తుంటాడు. పైగా ఇంటిలోని ఎక్కువ మంది సభ్యులకి ఆయన పట్ల గౌరవం ఉండటం కూడా ఆయనని ఇంటిలో ఒక విలక్షణమైన సభ్యుడిగా మనం చూడొచ్చు.
నిన్నటి ఎపిసోడ్ విషయానికి వస్తే, గీత మధురి-బాబు గోగినేని మధ్య జరిగిన ఘర్షణ పూరిత మాటల యుద్ధం ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తుంది. అదేంటంటే- గీత మధురి, కౌశల్ లు ఒక గ్రూప్ గా మారిపోగా మరో వైపుకి బాబు గోగినేని, సామ్రాట్, తనీష్ లు మరో గ్రూప్ కట్టారు. ఇక మిగిలిన సభ్యులు ఎటు తేల్చుకోలేక అలా ఉండిపోయారు అని అనిపిస్తుంది.
నిన్న జరిగిన సంవాదంలో మాత్రం గీత-బాబులు “నా ఇష్టం అంటే నా ఇష్టం” అనుకోవడం బిగ్ బాస్ ఇంటిలో రాబోయే రోజులు మరింత ఆసక్తికరంగా ఉండబోతున్నట్టుగా మనం ఊహించవచ్చు.